»   » రాజశేఖర్ కుమార్తెలో ఆ రెండూ.. తండ్రి లాగే శివాని కూడా!

రాజశేఖర్ కుమార్తెలో ఆ రెండూ.. తండ్రి లాగే శివాని కూడా!

Subscribe to Filmibeat Telugu

రాజశేఖర్ కుమార్తె శివాని త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. హిందీ సూపర్ హిట్ చిత్రం 2 స్టేట్స్ తెలుగు రీమేక్ లో శివాని హీరోయిన్ గా నటిస్తోంది. తన డెబ్యూ మూవీ కోసం శివాని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తన భిన్నమైన శైలిలో శివాని ప్రేక్షకులని మెప్పించడానికి సిద్ధం అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో భాగంగా శివాని ఆసక్తికరమైన విషయం వెల్లడించింది.

తన తండ్రి నటుడిగా కంటే మంచి ప్రతిభ ఉన్న డాక్టర్ అని అభిప్రాయపడింది. డాక్టర్ గా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే నటిగా రాణిస్తాన్ని చెబుతోంది. నటితో పాటు తనకు డాక్టర్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచే ఉండేదని శివాని తెలిపింది. శివానిలో ఓ డాక్టర్ నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా ఉంది.

 Shivani reveals her multiple talents

తాను చిన్నతనం నుంచే కూచిపూడి, కథక్ వంటి సంప్రదాయ నృత్యాలని నేర్చుకున్నట్లు తెలిపింది. 2 స్టేట్స్ చిత్రంలో అలియా భట్ పోషించ పాత్రలో శివాని ఎలా నటిస్తుందనే ఉత్కంఠ సినీవర్గాల్లో ఉంది.

English summary
Shivani reveals her multiple talents. She wanted to be a doctor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X