»   » ఈ ఫోటోలే సాక్ష్యం: నిర్మాత కుమారుడితో రాజశేఖర్ కూతురు నిజమే!

ఈ ఫోటోలే సాక్ష్యం: నిర్మాత కుమారుడితో రాజశేఖర్ కూతురు నిజమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సెలబ్రిటీలు రాజశేఖర్, జీవిత ముద్దుల కుమార్తె శివాని త్వరలో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రాజశేఖర్ ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.

రాజశేఖర్ కూతురు తెరంగ్రేటానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చింది. నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందురూరి హీరోగా పరిచయం అయ్యే సినిమాలో శివాని హీరోయిన్‌గా నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలు నిజమే

ఈ వార్తలు నిజమే

తాజాగా జరిగిన కొన్ని సంఘటనలను బట్టి ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన యాంటీ డ్రగ్ వాక్‌లో...... శివాని, శివ కందుకూరి కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు శివాని తల్లిదండ్రులు జీవిత రాజశేఖర్, రాజ్ కందుకూరి కూడా ఉండటం గమనార్హం.

Rajashekar Daughter Shivani Entry to Tollywood
ఫోటోలకు ఫోజులు

ఫోటోలకు ఫోజులు

యాంటీ డ్రగ్ వాక్ సందర్భంగా శివాని, శివ పక్క పక్కనే నిల్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదని అంటున్నారు. శివ కందుకూరి అమెరికా పెన్సిల్వేనియాలోని పెన్ స్టేట్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2018లో శివ, శివాని ఇద్దరినీ పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం కాబోతోంది.

అందంతో ఆకట్టుకున్న శివానీ

అందంతో ఆకట్టుకున్న శివానీ

తల్లితండ్రుల నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శివాని యాంటీ డ్రగ్ వాక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. శివాని చాలా అందంగా ఉందని, ఇండస్ట్రీకి అందమైన హీరోయిన్ దొరికింది అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి.

శివానీ ట్రైనింగ్

శివానీ ట్రైనింగ్

ప్రస్తుతం శివానీ సినిమా రంగానికి సంబంధించి వివిధ కళల్లో శిక్షణ తీసుకుంటోంది. డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో మెలుకువలు నేర్చుకుంటూనే, మెడిసిన్ కూడా చదువుతోంది.

English summary
Shivani Rajashekar and Shiva Kandukuri participated Kalamandir Foundation Anti Drug Walk. Shivani is Making Her Debut in Films soon. Interesting part is the guy she is going pair with. He is none other than Shiva Kandukuri, the son of Raj Kandukuri who has seen the biggest success in 2016 with Pellichoopulu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu