»   » గౌతమీపుత్ర శాతకర్ణి: అభిన‌వ క‌న్న‌డ కంఠీర‌వ శివ‌రాజ్‌కుమార్‌ (ఫస్ట్ లుక్)

గౌతమీపుత్ర శాతకర్ణి: అభిన‌వ క‌న్న‌డ కంఠీర‌వ శివ‌రాజ్‌కుమార్‌ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్‌.... ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కన్నడ డబ్బింగ్ మూవీ 'వీరప్పన్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. త్వరలో ఆయన బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ద్వారా మరోసారి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.

ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.

ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్

గౌతమీపుత్ర శాతకర్ణి మూవీకి సంబంధించి శివ‌రాజ్‌కుమార్ ఫ‌స్ట్‌లుక్‌ను ఆయ‌న త‌ల్లి పార్వ‌త‌మ్మ పుట్టిన‌రోజు(డిసెంబర్ 6) కానుక‌గా విడుద‌ల చేసారు.

నిర్మాత మాట్లాడుతూ

నిర్మాత మాట్లాడుతూ

చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ - ``క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్‌గారు మా సినిమాలో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగువారి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే శాత‌క‌ర్ణి చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌గారిపై అభిమానంతో శివ‌రాజ్‌కుమార్‌గారు అతిథిపాత్ర‌లోన‌టించ‌డానికి ఒప్పుకున్న శివ‌రాజ్‌కుమార్‌గారికి థాంక్స్‌.. అన్నారు.

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి

‘‘లెజెండ్రీ న‌టుడు రాజ్‌కుమార్ ఫ్యామిలీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఇత‌ర భాషా చిత్రాల్లో న‌టించ‌లేదు. తొలిసారి శివ‌రాజ్‌కుమార్ తెలుగులో న‌టించ‌డం విశేషం. శివ‌రాజ్‌కుమార్‌గారి త‌ల్లి పార్వ‌తమ్మ‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గౌతమిపుత్ర శాత‌క‌ర్ణిలో శివ‌రాజ్‌కుమార్‌గారి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్నాం`` అని నిర్మాతలు తెలిపారు.

గౌతమీపుత్ర శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

English summary
Kannada Super Star Shivaraj Kumar first look poster in Gautamiputra Satakarni released. Shivaraj Kumar is one of the special attractions in the magnum opus directed by Krish and produced by Rajeev Reddy and Saibabu Jagarlamudi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu