For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రకాష్ రాజ్‌తో పెళ్లి రూమర్స్, అమల రాజకీయం, చిరంజీవి, పవన్ గురించి... శోభారాణి హాట్ కామెంట్!

  |

  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ మహిళా నేతగా ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు శోభారాణి. ఆ పార్టీ ఇపుడు లేక పోవడంతో ఆమె తెలుగు దేశం పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శోభారాణి గతంలో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా కూడా పని చేశారు.

  తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభారాణి పలు విషయాలపై స్పందించారు. ప్రకాష్ రాజ్‌తో తనకు పెళ్లి జరిగినట్లు వచ్చిన రూమర్స్, అక్కినేని అమల రాజకీయం, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా పలు అంశాలపై రియాక్ట్ అయ్యారు.

  నాగబాబు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా తప్పే

  నాగబాబు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా తప్పే

  తనకు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అని నాగబాబు వ్యాఖ్యానించడాన్ని శోభారాణితప్పుబట్టారు. అది నాగబాబు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా అది తప్పే అన్నారు. బాలకృష్ణ‌పై కామెంట్ చేయండి అని చిరంజీవిని కొందరు అడిగిపుడు.... బాలకృష్ణది చిన్నపిల్లల మనస్తత్వం, నేను స్పందించను అన్నారే తప్ప ఎవరో నాకు తెలియదు అని మాట్లాడలేదని శోభారాణి గుర్తు చేసుకున్నారు.

  అక్కినేని అమలను రానివ్వం

  అక్కినేని అమలను రానివ్వం

  అక్కినేని అమల గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి అనే అంశంపై శోభారాణి స్పందిస్తూ... ‘‘అక్కినేని అమలా? అదెలా సాధ్యం? మేమెలా రానిస్తాం? ఆవిడ ఏ హోదాలో వస్తున్నారు? నాగార్జున గారి భార్య రావడం ఏమిటండీ? అది కూడా నేను ఏ భార్య అనాల్సి వస్తుంది. ఐయామ్ సో సారీ టూ సే దిస్. జనం దగ్గరికి మీరు ఏ లక్ష్యంతో వస్తున్నారు? ఏ బాధ్యతతో వస్తున్నారు. ఏ మార్పుతో వస్తున్నారు? చెప్పకుండా జగన్మోహన్ రెడ్డితో మేం వచ్చేస్తామంటే ఓట్లు వేయడానికి జనం సిద్ధంగా లేరు.'' అని శోభారాణి వ్యాఖ్యానించారు.

  అమలలో ఎముకలు తప్ప ఏమీ లేవు

  అమలలో ఎముకలు తప్ప ఏమీ లేవు

  సినిమా వాళ్లు సినిమా వాళ్లే... అమలలో చూడటానికి కూడా ఏమీ లేదు ఎముకలు తప్ప. స్కిన్నీగా ఉండటం స్టైల్ అని అలా ఉన్నారో? ఇంకేమైనా బాధలు ఉండి అలా ఉన్నారో తెలియదు కానీ ఆవిడ వచ్చి గట్టిగా మాట్లాడి పది మందిని ఉద్వేగ పరిచే ప్రసంగం ఆమె నోట్లో నుంచి రావడానికి ఏ మాత్రం అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే అనేలా ఉంటుంది. ఏమీ ఉపయోగం ఉండదు... అన్నరు శోభారాణి.

  ప్రకాష్ రాజ్‌తో పెల్లి రూమర్స్

  ప్రకాష్ రాజ్‌తో పెల్లి రూమర్స్

  గతంలో మీకు ప్రకాష్ రాజ్‌‌తో మ్యారేజ్ అయిందని రూమర్స్ వచ్చాయి. దాని వెనక కారణం ఏమిటి? అనే ప్రశ్నకు స్పందిస్తూ.... ‘‘ఆయన కూడా సినిమా యాక్టరే, అపుడు నేను పని చేసింది సినిమా యాక్టర్ పెట్టిన పార్టీ(పీఆర్పీ)లో కాబట్టి ఆటోమేటిక్ గా సినిమా వాళ్లతోనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. ఆ ఇన్సిడెంట్ నన్ను, ప్రకాష్ రాజ్ గారిని చాలా బాధించింది. ప్రకాష్ రాజ్ గారు నాకు ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా జరిగింది అన్నారు. రాజీకీయాల్లో, సినిమాల్లో ఉన్నపుడు ఇలాంటివన్నీ కామన్ గా వస్తాయన్నాను. ‘‘మీరు సీరియస్ పొలిటీషియన్‌గా ఉన్నారు ఇలాంటివి రాకుండా అడ్డుకోవాల్సింది. మా అమ్మ హాస్పటల్ లో ఉంది'' అని ప్రకాష్ రాజ్ అనేసరికి నేను చాలా బాధ పడ్డాను. ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి నా లైఫ్ స్పాయిల్ చేయాలనుకున్నారు. కొంతమేర సక్సెస్ కూడా అయ్యారు. ఆయన్ను దాసరి నారాయణరావు, మోహోన్ బాబు ద్వారా ఒకటి రెండు సార్లు కలవడం తప్ప పెద్దగా పరిచయం లేదుని శోభారాణి చెప్పుకొచ్చారు.

  పవన్ కళ్యాణ్, రేణఉ దేశాయ్ సహజీవనంపై

  పవన్ కళ్యాణ్, రేణఉ దేశాయ్ సహజీవనంపై

  భార్యా భర్తలు విడిపోవడానికి అనేక కారణాలుంటాయి. న్యాయస్థానాలు కూడా ఫ్యామిలీ విషయాల్లో చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నాయి. భార్య భర్తలకు గిట్టకపోతే విడిపోయి వేరేవారితో సహజీవనం చేసినా తప్పుకాదని సుప్రీకోర్టు జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ రాకముందే పవన్ కళ్యాణ్ గారు సహజీవనం చేశార అని శోభారాణి గుర్తు చేసుకున్నారు.

  పవన్, రేణు అందకుకే విడిపోయారేమో?

  పవన్, రేణు అందకుకే విడిపోయారేమో?

  పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విషయాన్ని వాళ్ల సంసారానికి సంబంధించిన విషయంగానే భావిస్తాను. ఆ చిన్న సమస్యను తీసుకొచ్చి సమాజం మీద పెద్దగా రుద్దే ప్రయత్నం అయితే చేయను. నేను సెన్సార్ బోర్డులో పని చేసినపుడు సినిమా వాళ్ల ఫ్యామిలీలను దగ్గరగా చూశాను. చాలా మందికి పిల్లలతో, కుటుంబ సభ్యులతో గడిపే వాతావరణం ఉండదు. సినిమాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కారణంగానే రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు వచ్చి ఉండొచ్చు అని.... శోభారాణి అభిప్రాయపడ్డారు.

  ఆవేశం వద్దని చిరంజీవి చెప్పారు

  ఆవేశం వద్దని చిరంజీవి చెప్పారు

  పీఆర్పీలో ఉన్నపుడు ఒకసారి నేను, పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ప్రసంగాలు ఇస్తున్నపుడు చిరంజీవిగారు పిలిపించారు. సమాజంలో జరిగే అన్యాయాలు, వివక్ష లాంటి వాటిపై తన మనసులో కూడా జ్వాల ఉంది, కానీ మనం రాజకీయాల్లోకి ఒక కొత్త స్లోగన్‌తో వచ్చాం. ఇక్కడ కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన అని చెప్పారని... శోభారాణి గుర్తు చేసుకున్నారు.

  English summary
  Shobha Rani Reveals About PawanKalyan And Renu Desai Divorce and Hot comments on Amala Akkineni political entry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X