Just In
- 3 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమలాపాల్ కు టార్చర్, మామగారు చెప్పినవన్నీ అన్ని అబద్దాలే
హైదరాబాద్ : అమలాపాల్ తన భర్త విజయ్‌తో విడాకులు తీసుకుందనే వార్తపై రోజుకో కథనం వస్తున్న సంగతితెలిసిందే. గత కొన్నాళ్ళుగా వీరిద్దరి విడాకులకు సంబంధించి కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై విజయ్ తండ్రి ఏ.ఎల్ అళగప్పన్ స్వయంగా విజయ్, అమలాపాల్ వీడిపోయారని ప్రకటించారు. ఈ విషయమై ఆయన తమిళ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వూలో ఆయన చెప్పిన విషయాలుకు కౌంటర్ వచ్చింది. ఆమెను భరించలేనంత మెంటర్ టార్చర్ పెట్టారని తెలియచేసారు.
అమలాపాల్ స్నేహితులు ఒకరు మీడియాతో మాట్లాడుతూ... చక్కగా సాగుతున్న అమలాపాల్ సంసారంలో చిచ్చు పెట్టింది ఆమె అత్తగారు, మామగారు అని తేల్చి చెప్పారు. ఆ కుటుంబమే విడిపోవటానికి కారణ మవుతోందని వ్యాఖ్యానించారు. ఈ రోజు మీడియా వద్ద వాళ్లు మాట్లాడే మాటలు అన్ని కూడా అబద్దదాలే అని తేల్చి చెప్పారు.
అలాగే...అప్పటికీ అమలాపాల్ చాలా ఓపికగా మొదటినుంచి ప్రతీ సమస్యను పరిష్కరించుకుంటూ వస్తోంది. అయితే సమస్యలు పీక్ కు వెళ్లినప్పుడు ఆమెలో ఆశ కోల్పోయింది. అప్పుడే ఈ సమస్యలు తను పరిష్కరించుకోలకపోతున్నానే ఆవేదనతో భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంది. అలాంటి మెంటల్ టార్చర్ ని భరిచటం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పారు.
అయితే ఇప్పుడు విజయ్ తండ్రి మీడియా వద్ద ఆమె ఇమేజ్ ని నాశనం చేయటానికి తమ కోడలిపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. ఆమెను ఓ భాధ్యతాహిత్యమైన వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ లీగల్ విడిపోతారని ఆమె స్నేహితుడు ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.
మరిన్ని విషయాలు స్లైడ్ షోలో...

విభేధాలు లేవు
అమలాపాల్ స్నేహితుడు చెప్పేదాని ప్రకారం..విజయ్ కు తన భార్యకు మధ్యా ఏ విభేధాలులేవు.

అభ్యంతరాలు లేవు
అమలాపాల్ తన కెరీర్ విషయంలో కానీ లైఫ్ స్టైల్ విషయంలో కానీ అతనేమి అభ్యంతరం పెట్టలేదు.

కుటుంబం నుంచే
కేవలం విజయ్ పేరెంట్స్ నుంచే సమస్య వచ్చింది. అతని పేరెంట్స్ ఆమెను మొదటి నుంచి ఏక్సెప్ట్ చెయ్యలేదు.

కానీ
విజయ్ ఎప్పుడూ తన లైఫ్ పార్టనర్ అమలాపాల్ కు ఎక్సట్రీమ్ సపోర్ట్ ఇచ్చాడు.

కుటుంబం మాత్రం
అతని కుటంబసభ్యులు ఆమెను ఓ స్త్రీ గా కానీ, తమ కుటుంబ సభ్యురాలిగా కానీ పరిగణించలేదు. ఆమె భావాలని, ఆలోచనలను కానీ వారు ఎప్పుడూ గౌరవించలేదు.

రీసెంట్ గా మీడియాతో ఎల్ అళగప్పన్ మాట్లాడుతూ...
అమలాపాల్ ని దారుణంగా తిట్టిపోసినంత పని చేసినంత పనిచేసాడు. ఆయన చెప్పేదాని ప్రకారం...ఇంట్లో పెద్దలెవరకి కానీ, ఆమె తన భర్త విజయ్ కు కానీ ఆమె గౌరవం ఇవ్వలేదు. దాంతో ఆమె భర్త కానీ, అత్తామామలు కానీ ఆమె విషయంలో సంతోషంగా లేరు.

వినలేదు
ఆమె యాక్టివ్ గా సినిమాల్లో నటించటం, ముఖ్యంగా కోలివుడ్ లో నటించటం అసలు ఇష్టంలేదని చెప్తున్నా ఆమె వినలేదని మామ చెప్పారు మీడియాతో

భర్త మాట నిర్లక్ష్యం
కేవలం ఫ్యామిలీ లైఫ్ పైనే కాన్సర్టేట్ చేయమని విజయ్ కోరినా, అమలా పాల్ పట్టించుకోలేదు. తాను సినిమాలు వదలలేనని తేల్చి చెప్పటమే కారణం అంటున్నారు.

రూమర్స్
అయితే అసలు కారణం వేరని, డిల్లీ లోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఆమె రిలేషనే కారణమని మరోవైపు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మాట తప్పింది
పెళ్లికు ముందు ఆమె ఇక సినిమాలకు స్వస్ది చెప్పి గృహిణిగా నడుచుకుంటానని మాట ఇచ్చి తప్పిందట.

ధనుష్ కోసం
ధనుష్ హీరోగా వస్తున్న వడ చెన్నై చిత్రంలో మొదట సమంతను అనుకున్నారు. కాని సమంత వివాహం గురించి నో చెప్పటంలో అమలాపాల్ సీన్ లోకి వచ్చింది.

మూడేళ్లు
ఈ సినిమా కోసం మూడేళ్లు కాల్షీట్ లను అమలా పాల్ ఇవ్వటం విజయ్ కు షాక్ కలిగించిందని సమాచారం.

సొంత తల్లితండ్రులు
అమలా పాల్ తన సొంత తల్లి తండ్రుల మాట కూడా వినటానికి ఇష్టపడం లేదని అలగప్పన్ అన్నారు.

అవన్నీ అనవసరం
తనకు వారు డైవర్స్ తీసుకుంటారా లేక అలాగే కంటిన్యూ అవుతారా అనేది ముఖ్యం కాదని, తనకు తన కుమారుడు సంతోషంగా ప్రశాంతంగా బ్రతకటమే ముఖ్యం అని తేల్చి చెప్పారు.

అటు వైపు నుంచి
అమలాపాల్ తల్లి తండ్రుల వైపు నుంచి వాళ్ల ఆలోచన ఏమిటి..వారు స్టాండ్ ఏమిటి అనేది ఇప్పటివరకూ ఓపెన్ కాలేదు

నిర్లక్ష్యం
తన కుటుంబాన్ని కోడలిగా అమలాపాల్ పట్టించుకోకపోవటం,నిర్లక్ష్యంగా ఉండటం విజయ్ సహించలేకపోయారని తెలుస్తోంది.

అమలాపాల్ కు టార్చర్, మామగారు చెప్పినవన్నీ అన్ని అబద్దాలే
వారిద్దరివి విబిన్నమైన లైఫ్ స్టైల్స్ కావటం కూడా వీరి వైవాహిక జీవితాన్ని దెబ్బ కొట్టిందని తెలుస్తోంది.

నటుడుతో ..
అమలా పాల్ కాపురం కూలటానికి కారణం తమిళంలోని పెళ్లైన ఓ యంగ్ హీరో అని చెప్తున్నారు. అతనితో ఆమె ఓవర్ ఫ్రెండ్లీగా ఉండటం విజయ్ సహించలేకపోయాడని చెప్తున్నారు

సోషల్ మీడియాలో
సోషల్ మీడియాలో అమలా పాల్ డైవర్స్ వార్త హాట్ టాపిక్ గా రన్ అవుతోంది. అక్కడ నుంచే కొన్ని రూమర్స్ సైతం పుడుతున్నాయి