»   » ఎవిడెన్స్ తో మ్యాటర్ లీకైంది :పోటీ సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం 25 లక్షలు ఖర్చు

ఎవిడెన్స్ తో మ్యాటర్ లీకైంది :పోటీ సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం 25 లక్షలు ఖర్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మేము కూడా మీలాగే షాక్ అయ్యాం. కానీ ఈ విషయాన్ని హీరోనే స్వయంగా చెప్పటంతో నమ్మక తప్పలేదు. ఈ మధ్యకాలంలో పోస్టర్స్, ట్రైలర్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హిందీ సినిమా శివాయ్. అజయ్ దేవగన్ నటిస్తూ, డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై నెగిటివ్ పబ్లిసిటీ నిమిత్తం ప్రముఖ నిర్మాత కరుణ్ జోహార్ (బాహుబలి హింది నిర్మాత) డబ్బు ఖర్చుపెట్టాడనే వార్త ఇప్పుడు బాలీవుడ్ ని షాక్ కు గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే... అజయ్ దేవగన్ తాజా చిత్రం శివాయ్...ఈ దీపావళికు (అక్టోబర్ 28న) విడుదల అవుతోంది. ఇదే రోజున కరణ్ జోహార్ తాజా చిత్రం యే దిల్ హై ముష్కిల్ సైతం రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో తమ పోటీ చిత్రమైన శివాయ్ పై నెగిటివ్ ప్రచారం చేసి బురద జల్లమని కరుణ్ జోహార్ పురమాయించాడ.

వాస్తవానికి గత కొద్ది రోజులుగా బాలీవుడ్ లో భారీ చిత్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అక్టోబర్ 28న శివాయ, యే దిల్ హై ముష్కిల్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచారం, రివ్యూల విషయంలో వివాదం మొదలైంది. శివాయ చిత్ర హీరో దర్శకుడు అయిన అజయ్ దేవగన్ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన ఓ ఆడియో క్లిప్ వివాదానికి తెర తీసింది.

ఆడియో క్లిప్ లోని గొంతు ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ దిగా చెప్పిన అజయ్ దేవగన్, ఆయన తన శివాయ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేసేందుకు 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా తెలిపాడు. ఈ విషయాన్ని శివాయ చిత్ర మరో నిర్మాత కుమార్ మంగత్ కు కమాల్ ఫోన్ లో చెపుతుండగా రికార్డ్ చేసిన ఆడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టుగా తెలిపారు.

English summary
Ajay Devgn himself posted an audio clip where Kamaal R Khan admits to being paid by Karan to badmouth Shivaay. For the uninitiated Shivaay and Ae Dil Hai Mushkil are releasing on the same date at the box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu