»   » రెండు రోజుల్లో 75లక్షలు.. క్రేజీ మూవీ కోసం మోహన్ బాబు పారితోషకం!

రెండు రోజుల్లో 75లక్షలు.. క్రేజీ మూవీ కోసం మోహన్ బాబు పారితోషకం!

Subscribe to Filmibeat Telugu

మోహన్ బాబు నటన గురించి పత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రనైనా తన డైలాగ్ డెలివరీతో మోహన్ బాబు అద్భుతంగా పండించగలరు. కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో సావిత్రి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాష చిత్రాల్లో ఎనలేని కీర్తిని పొంది మహా నటిగా పేరుగాంచిన సావిత్రి జీవిత చరిత్ర వెండి తెరపై మెరిసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు.

ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా నటిస్తుండడం విశేషం. ప్రఖ్యాత నటుడు ఎస్ వి రంగారావు పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. మాయాబజార్ వంటి కళాఖండంలో సావిత్రి, ఎస్ వి రంగారావు నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గాను మోహన్ బాబు కేవలం రెండు రోజులకు 75 లక్షల భారీ పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Shocking remuneration for Mohan Babu

ఎస్వి రంగరావు పాత్ర కోసం మోహన్ బాబు సరిపోతారని భావించి చిత్ర యూనిట్ ఆయన్ని ఎంపిక చేసుకుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మరియు సమంత కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Shocking remuneration for Mohan Babu. Mohan Babu playing SV Rangarao role in Savitri biopic
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X