»   » హీరోయిన్ తమన్నా మీద చెప్పు విసిరిన హైదరాబాద్ అభిమాని, ఎందుకంటే...

హీరోయిన్ తమన్నా మీద చెప్పు విసిరిన హైదరాబాద్ అభిమాని, ఎందుకంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
తమన్నా మీద చెప్పు విసిరిన హైదరాబాద్ అభిమాని..!

హీరోయిన్ తమన్నా మీద ఓ అభిమాని చెప్పు విసిరాడు. హైదరాబాద్‌లో హిమాయత్ నగర్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభోత్సవం కోసం ఆదివారం తమన్నా ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే అది ఆమెకు తగలకుండా కొద్ది దూరంలో పడింది.

దాడి చేసింది ఎవరు?

దాడి చేసింది ఎవరు?

తమన్నా మీద దాడి చేసిన వ్యక్తిని కరీముల్లాగా గుర్తించారు. వెంటనే కరీముల్లాను అదుపు చేసిన బౌన్సర్లు అతడిపై దాడి చేశారు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 దాడికి కారణం ఏమిటి?

దాడికి కారణం ఏమిటి?

దాడి ఎందుకు చేశావ్ అని కరీముల్లాను ప్రశ్నిస్తే..... ఈ మధ్య కాలంలో తమన్నా సినిమాలు సరిగా చేయడం లేదని, అందుకే కోపంతో చెప్పు విసిరాను అని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

 హైదరాబాద్‌లో తమన్నా సందడి

హైదరాబాద్‌లో తమన్నా సందడి

హిమాయత్ నగర్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆమెను చూసేందుకు పోటీ పడ్డారు. ఇదే రోజు సాయంత్రం కొండాపూర్‌లో మరో మలబార్‌ నగల దుకాణాన్ని కూడా తమన్నా ప్రారంభించనున్నారు.

 తమన్నా సినిమాలు

తమన్నా సినిమాలు

తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో ‘నా నువ్వే', ‘క్వీన్ వన్స్ ఎగైన్' చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన తమిళ మూవీ స్కెచ్ ఇటీవల విడుదలైంది. హిందీలో కామోషి, మరాఠిలో ఎబిసి చిత్రాలు చేస్తోంది.

English summary
A shoe was hurled at actress Tamanna in 'malabar gold and diamonds' opening ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu