»   » మహేష్ బాబు ఒక్క సినిమాకి అంతమంది నిర్మాతలా..!?

మహేష్ బాబు ఒక్క సినిమాకి అంతమంది నిర్మాతలా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మురుగ దాస్ సౌత్ ఇండియా లోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరు... మహేష్ బాబు టాలీవుడ్ దిగ్గజాల్లో చేరిన ఇప్పూదు టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న హీరో. మామూలుగానే వీరిద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే ఆసక్తిగా చూసే జనం...ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే ఇంకెంత భారీ అంచనాలతో ఉంటారో చెప్పక్కరలేదు.

ఇప్పుడు మహేస్-మురుగ దాస్ల తో వస్తున్న సినిమా అదే స్థాయి అంచనాలని చేరుకుంటోంది ఇంకా మొదలు కాకుండానే..ఊహాగానాలు మొదలయ్యాయి. 80 కోట్ల పైగానే (100 కోట్లకూ చేరవచ్చంటున్నారు) భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాని నిర్మించటం అంటే బడా నిర్మాతలకీ భారమే... ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయినా భారీ నష్టాలని చూడవలసి వస్తుంది.

mahesh

ఈ నేపథ్యం లోనే మ‌హేష్‌బాబు కేరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఇంత బ‌డ్జెట్ ఎవ‌రు స‌మ‌కూరుస్తున్నారు.? అన్న ప్రశ్న మొదలయ్యింది ఈ సినిమాకు నిర్మాత‌లు ఎంత‌మంది అన్న విష‌యాలు ఆరా తీస్తే షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా పెద్ద పెద్ద సంస్థలే రంగం లోకి దిగాయి. ఈ సినిమాకు ప్ర‌ధాన నిర్మాత ఎన్‌వి.ప్ర‌సాద్‌. ఇక రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, లియో ప్రొడ‌క్ష‌న్‌, మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నాయి.

ఇక్కడితో అయిపోలేదు ఈ సినీ నిర్మాణ సంస్థలతో బాటు మురుగ‌దాస్‌తో ఉన్న ఒప్పందం ప్ర‌కారం ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, మ‌హేష్ సొంత బ్యాన‌ర్ అయిన ఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయ‌ట‌. సో ఈ లెక్క‌న చూస్తే ఈ సినిమాలో మొత్తం ఆరు నిర్మాణ సంస్థ‌లు పాలు పంచుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఓ బ‌లమైన సామాజిక నేప‌థ్యం ఉన్న స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ప‌రిణితి చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌రీష్‌జైరాజ్‌, సంతోష్‌శివ‌న్ లాంటి సెలబ్రిటీ టెక్నీషియన్ లు ఈ సినిమా కోసం పని చేయనున్నారు.

English summary
project will have funding from multiple producers. The main producer is NV Prasad as per the information and anethor five company's are co producing this film. By having a look at this list you can be rest assured about the 100 crore budget.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu