»   » మన క్లాసిక్...40 ఏళ్ల తర్వాత పాకిస్ధాన్ లో రిలీజైంది

మన క్లాసిక్...40 ఏళ్ల తర్వాత పాకిస్ధాన్ లో రిలీజైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన 'షోలే' సినిమా తొలిసారిగా పాకిస్థాన్‌లో విడుదలైంది. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, హేమమాలిని, జయబాధురి, సంజీవ్‌కుమార్‌, అంజాద్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో విడుదలైన 40 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో శుక్రవారం విడుదలైంది. దీన్ని 2డీ, 3డీ రూపాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల ముందు అమితాబ్‌, ధర్మేంద్ర, అంజాద్‌ ఖాన్‌ల కటౌట్లను ఏర్పాటు చేసి యువత సందడి చేస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మనదేశంలో ఆ సినిమా వచ్చి నలభై సంవత్సరాలైనా దీనికి దీటైన చిత్రం బాలీవుడ్‌లో ఇంతవరకు రాలేదంటే అతిశయోక్తికాదు. బాలీవుడ్‌లో ఆల్‌టైమ్ రికార్డులన్నిటినీ తిరగరాసిన షోలే చిత్రం ఇప్పటికీ నెం.1 స్థానంలోనే వెలుగొందుతోంది. ఈ సినిమా వింతలు అన్నీ ఇన్నీ కాదు. షోలే అంటే అదో సంచలనం. అమితాబ్‌బచ్చన్‌కు, అంజాద్‌ఖాన్‌కు ఈ చిత్రం తర్వాత స్టార్‌డమ్ సింగిల్ నైట్‌లో వచ్చింది.

'Sholay' : India's Cult Classic releases in Pak after 40 Years

1975లో విడుదలైన ఈ చిత్రం సామాజిక దృక్పధంతో రూపొందిన కథనంతో సాగుతుంది. సమాజంలోవున్న రుగ్మతలు, బందిపోట్లు, ప్రేమలు, త్యాగాలు, స్నేహంలో వున్న మాధుర్యం తదితర అంశాలను ఈ చిత్రం స్పృశిస్తుంది. అమితాబ్‌బచ్చన్ కెరీర్‌ను ఈ చిత్రం మలుపుతిప్పింది. ఈ చిత్రంలో విలన్ అంజాద్‌ఖాన్ డైలాగ్ ‘కిత్నీ ఆద్మీ థా'అన్న మాట అప్పట్లో అందరి నోట్లో నానేది. ‘అరెవో సాంబ' అన్న డైలాగ్ ఊతపదమైపోయింది.

ఆర్.డి.బర్మన్ సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. సంజీవ్‌కుమార్, జయబాధురి, సత్యన్‌కప్పు వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన ఈ చిత్రానికి లభించిన అవార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఫిలిమ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ ఎడిటర్‌గా ఎం.ఎస్.షిండే బహుమతిని అందుకున్నారు. బెస్ట్‌సపోర్ట్ యాక్టర్‌గా అమితాబ్‌బచ్చన్ ఎంపికయ్యారు. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ కెమెరామెన్ లాంటి అవార్డులు కూడా షోలేనే వరించాయి.

సలీమ్-జావెద్ అందించిన కథతో ఈ చిత్రం ఆద్యంతం క్లాస్‌మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగుతుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ముంబాయిలో ఒకే థియేటర్‌లో ఇంకా ప్రదర్శింపబడుతోందంటే విచిత్రమేమరి. 2005లోకూడా 50 సంవత్సరాలకుగాను ఎంపిక చేసే బెస్ట్ బాలీవుడ్ మూవీగా షోలే ఎంపికైంది. జి.పి.సిప్పి రూపొందించిన ఈ చిత్రం విడుదలయ్యాక అనేక చిత్రాలు అదే బాటనుపట్టాయి.

కానీ ప్రేక్షకులు షోలేకు అందించిన విజయాన్ని మరే చిత్రానికి అందించలేదు. ఇప్పుడు ఇదే చిత్రం మళ్లీ విడుదల కానుంది. ఇప్పటివరకు ఈ చిత్రం పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నారు. భారతదేశంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం అక్కడ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని విమర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
'Sholay', the cult Bollywood classic starring Amitabh Bachchan, Dharmendra, Hema Malini and Jaya Bachchan, hits the screens in Pakistan for the first time ever 40 years after its release in India.
Please Wait while comments are loading...