Just In
Don't Miss!
- Sports
ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్
- Finance
పెట్రోల్ ధరలు తగ్గుతాయా, బడ్జెట్లో నిర్మలమ్మ గుడ్‌న్యూస్!
- News
నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డి
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్ కాబట్టే....3 కోట్లు పిండుకోవాలనే ప్లాన్!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పుణ్యమా అని నిర్మాతకు కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయి. వాస్తవానికి 'గబ్బర్ సింగ్' చిత్రం హిందీ హిట్ మూవీ 'దబాంగ్' చిత్రానికి తెలుగు రీమేక్.
'గబ్బర్ సింగ్' అనే టైటిల్‌కు సినిమా స్టోరీకి ఎలాంటి సంబంధం లేక పోయినా......తెలుగు నేటివిటీకి తగిన విధంగా కథలో కొద్దిపాటి మార్పులు చేసి హీరో క్యారెక్టర్లో ఓ అంశాన్ని జొప్పించి 'గబ్బర్ సింగ్' టైటిల్ సెట్టయ్యేలా చేసారు. 'గబ్బర్ సింగ్' అనేది షోలే సినిమాలో విలన్ పేరు. షోలేలో విలన్ క్యారెక్టర్‌ను ఇష్టపడే హీరో తన పేరును గబ్బర్ సింగ్‌గా మార్చుకుంటాడు.
అప్పట్లో గబ్బర్ సింగ్ పేరును వాడుకున్నందుకు గాను హిందీ మూవీ 'షోలే' నిర్మాతలకు నిర్మాత బండ్ల గణేష్ రూ. 25 లక్షలు చెల్లించాడు. పవర్ స్టార్ నటించిన సినిమా కావడంతో సినిమా భారీ విజయం సాధించి కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించింది.
తాజాగా గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్‌గా 'గబ్బర్ సింగ్-2' పేరుతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సారి 'గబ్బర్ సింగ్' పేరును వాడుకుంటే రూ. 3 కోట్లు చెల్లించాలని మెులికపెట్టారట 'షోలే' నిర్మాతలు.
పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలుగులో భారీ మార్కెట్ ఉన్న నేపథ్యంలో 'గబ్బర్ సింగ్' పేరును మరోసారి వాడుకుంటే 'షోలే' నిర్మాతలు ఇంత భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో పవర్ స్టార్ కలెక్షన్ పవర్ తెలియక అతి తక్కువ మొత్తానికే గబ్బర్ సింగ్ పేరు వాడుకోవడానికి ఒప్పుకున్నామని, ఈ సారి మాత్రం అలా చేయబోమని అంటున్నారట.
ఇతర హీరోలెవరైనా ఈ పేరు వాడుకుంటే ఇంత మొత్తం డిమాండ్ చేసే వారు కాదని, పవర్ స్టార్ బాక్సాఫీసు స్టామినా గురించి తెలుసుకున్నాకే వారు ఇంత భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో షోలే నిర్మాతలకు అంత మొత్తం చెల్లించడం ఇష్టం లేక వేరే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రానికి 'బెంగాల్ టైగర్' టైటిల్ పెట్టే ఆలోచన ఉందని గతంలో సంపత్ నంది ఓసారి వెల్లడించిన సంగతి తెలిసిందే.