»   » ఒక సీన్ కోసం మూడేళ్లు.. షోలేలో ఆసక్తికరమైన అంశం

ఒక సీన్ కోసం మూడేళ్లు.. షోలేలో ఆసక్తికరమైన అంశం

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత సినీ పరిశ్రమలో షోలే సాధించిన విజయం అంతా ఇంతా కాదు. ప్రేమ కథలు జోరుగా వస్తున్న తరుణంలో షోలే చిత్రం బాలీవుడ్‌లో ఫిలిం మేకింగ్‌ను సమూలంగా మార్చివేసింది. ఇప్పటికీ ఆ సినిమా షూటింగ్ సమయంలో చోటుచేసుకొన్న విషయాలు సగటు ప్రేక్షకుడ్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. షోలేకు సంబంధించిన ఓ సీన్‌ను పర్ఫెక్ట్‌గా చిత్రీకరించడానికి దర్శకుడు రమేష్ సిప్పీకి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందని ఇటీవల అమితాబ్ వెల్లడించారు.

సీన్లు షూట్ చేయడంలో రమేశ్ సిప్పీ పర్ఫెక్ట్

సీన్లు షూట్ చేయడంలో రమేశ్ సిప్పీ పర్ఫెక్ట్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సన్నివేశాలు తెరకెక్కించడంలో రమేశ్ సిప్పికి ఎవరూ సరితూగరని, ఆయన కమిట్‌మెంట్ అలా ఉంటుంది అని తెలిపారు. నేను, జయ నటించే ఒక సీన్ ఫర్ఫెక్ట్‌గా రావడానికి మూడు సంవత్సరాలు ప్రయత్నించారు అని ఆయన పేర్కొన్నారు.

జయ లాంతరు వెలిగించే సన్నివేశం

జయ లాంతరు వెలిగించే సన్నివేశం

షోలేలో జయబచ్చన్ సాయంత్రం పూట ఇంటి అరుగుమీద ఉండే లాంతరును వెలిగించే సన్నివేశం ఉంది. ఆ సమయంలో ఎదురుగా ఉండే ఇంటి అరుగు మీద కూర్చుని నోట్లో హార్మోనికా వాయిస్తూ ఉంటాను. ఈ సీన్ కోసం ఓ ప్రత్యేకమైన లైటింగ్ కావాల్సి వచ్చింది. సూర్యాస్తమయంలో ఆ సీన్‌ను అద్భుతంగా చిత్రీకరించాలన్న భావనలో కెమెరామెన్ ఉన్నారు.

డీవోపీ మూడేళ్లు ప్రయత్నించారు..

డీవోపీ మూడేళ్లు ప్రయత్నించారు..

‘ఆ సీన్ కోసం చాలాసార్లు కెమెరామెన్ ప్రయత్నించారు. కానీ ఆయన అనుకొన్న అవుట్‌పుట్ రాలేదు. ప్రతీసారి లైటింగ్‌లో తేడా వచ్చేది. అనుకున్న షాట్ తీయడానికి మేము మూడేళ్లు పట్టింది. ఒకవేళ అనుకున్న మేర సీన్ రాకపోతే నేను ఈ చిత్రాన్ని విడుదల చేయను. దాంతో మూడు సంవత్సరాలపాటు ఈ సీన్ కోసం ప్రయత్నించి చివరికి సఫలమయ్యాం' అని బిగ్ బీ తన అనుభవాలను పంచుకొన్నారు.

ఆల్‌టైమ్

ఆల్‌టైమ్

1975లో విడుదలైన ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయబచ్చన్, హేమామాలిని, సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్ నటించారు. ఈ చిత్రం ఇండియాలోని ఆల్ టైమ్ టాప్ 10 చిత్రాల జాబితా కోసం బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన లిస్ట్‌లో షోలే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

షోలేలో ఆ సీన్ ఇదే..

షోలేలో ఆ సీన్ ఇదే..

షోలేలో చాలా కష్టపడి చిత్రీకరించిన సీన్ ఇదే..

English summary
The scene from Sholay where Jaya Bachchan turns off the lanters at dawn as a young, harmonica-playing Amitabh Bachchan looks on, took three years to shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu