twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పీపుల్స్ వార్’ మొదలెట్టిన నారాయణమూర్తి

    By Bojja Kumar
    |

    సోంపేట కాల్పుల ఘటనపై విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తి 'పీపుల్స్ వార్' చిత్రం రూపొందించేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శుక్రవారం శ్రీకాకుళంలో ప్రారంభం అయింది. సోంపేట సమీపంలోని బీల ఏరియాలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. నారాయణ మూర్తి లీడ్ రోల్ చేస్తుండగా, శ్రీహరి, పోసాని కృష్ణ మురళి, తెలంగాణ శకుంతల ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ...70 రోజుల పాటు సాగే సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తామన్నారు. సోంపేట, బావేరు, సంత బొమ్మాలి మండలాల్లో షూటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

    స్వాతంత్య్రం వచ్చిన తరవాత ప్రజలు సాగించిన గొప్ప ఉద్యమం సోంపేటలో జరిగింది. ఇది మార్గదర్శకమైనది. అందుకే ఓ కళాకారుడిగా సామాజిక బాధ్యతతో సినిమా తీయబోతున్నాను అన్నారు. నారాయణ మూర్తి ఇటీవల తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'పోరు తెలంగాణ' చిత్రం రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల విషయంలో సీమాంధ్ర ప్రాంతంలో ఆటంకాలు ఏర్పడటంతో నారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కళాకారుడిగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాటిపై చిత్రాలు తీసే హక్కు తనకు ఉందని, తనకు ప్రాంతీయ వాదులు రుద్దవద్దని స్పష్టం చేశారు. దూకుడు సినిమా ధాటికి పోరు తెలంగాణ సినిమా ఆ మధ్య ఆడక పోవడం మరోసారి విడుదల చేశారు కూడా.

    English summary
    In a first, a film on Uddanam area is being made by director R Narayana Murthy, shooting of which would begin here on Friday. The film theme is based on the brutal police firing on the agitators at Sompeta and Kakarapalli power plant sites. Titled 'People's War', Murthy is playing the role of the main protagonist in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X