twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక నుంచి తెలుగులో షూటింగ్ అంటే ఈ రూల్స్ పాటించాల్సిందే...

    By Srikanya
    |

    మూడు వారాలుగా నిర్మాతల మండలి...నటీనటుల సంఘం తోనూ, దర్శకుల సంఘం తోనూ, ఇతర సాంకేతికనిపుణుల వర్గాలతోనూ చర్చలు జరిపి నిర్ణయాలను తీసుకుంది. వాటిల్లో కొన్ని ప్రధానంగా ఈ విధంగా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి...

    నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇక మీదట నిర్మాతలే స్వయంగా ఎంపిక చేసుకోవాలి. అందరి పారితోషికాల వివరాలు అగ్రిమెంటు కాపీలో పొందుపరచడం జరుగుతాయి.
    పూర్తి స్క్రిప్టు, నిర్మాణపు అంచనా వ్యయం, పనిచేస్తున్నవారి అన్ని వివరాలు అడ్వయిజరీ కమిటీ (నటీనటులు, దర్శకులు, నిర్మాతల సంఘాల ప్రతినిధులతో కూడిన)కి నిర్మాతలు అందజేయాలి.
    ప్రతి షెడ్యూల్ అనంతరం జరిగిన షూటింగ్‌ లోని బాగోగులు గురించి అడ్వయిజరీ కమిటీ ముందు దర్శక, నిర్మాతలు రివ్యూ చేసుకోవాలి.
    రూ.5 లక్షలు పైన పారితోషికం తీసుకునే నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్‌ కు హాజరయ్యే ఏర్పాట్లు స్వయంగా తామే చూసుకోవాలి. కార్లకు అయ్యే డీజిల్ మాత్రం నిర్మాత భరిస్తారు. అలాగే వ్యక్తిగత సిబ్బంది జీతాలు కూడా ఇక ముందు వారే ఇచ్చుకోవాలి.
    ఫిలింనగర్ క్షేత్రంగా 15 కి.మీ. దూరం అధిగమించి జరిగే షూటింగ్సుకు మాత్రం నిర్మాత తగిన ఏర్పాట్లు చేస్తారు.
    ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి రోజుకు రూ.3500/లు నిర్మాత ఇవ్వడం జరుగుతుంది. ఆ సొమ్ములోనే వారి బస, ఆహారపు అవసరాలను తీర్చుకోవలసి ఉంటుంది.
    షూటింగు లొకేషన్లలో ఇక మీదట టిఫిన్ లేదా భోజనం ఏర్పాట్లు బఫే పద్ధతినే జరుగుతాయి.
    విదేశాల్లో జరిగే షూటింగుల సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఒకే బస్సులో లొకేషన్‌ కి వెళ్లవలసి ఉంటుంది.
    ఔట్ ‌డోర్ ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కామన్‌ గా మాత్రమే కారవాన్ (పురుషులకు, మహిళలకు రెండు విభాగాలుగా)సదుపాయం ఉంటుంది.
    ఇక మీదట ఏ అర్టిస్టులకైనా సినిమా అకౌంట్ లోనే పారితోషికాలు నిర్ణయించబడతాయి. రోజువారీ పద్ధతిలో ఎవరికీ చెల్లింపులు ఉండవు.
    సినిమాల్లో నటించే ప్రతి ఆర్టిస్టు నటీనటుల సంఘం(మా)లో విధిగా సభ్యత్వం కలిగి ఉండాలి. అలా కానివారితో ఇతరులు కలిసి పనిచేయడం ఉండదు. చెల్లింపులన్నీ రికార్డు పరంగా వుంటాయి కాబట్టి ఎవరికీ అన్యాయం జరిగే వీలుండదు. టీడీఎస్ లు సభ్యులకు పూర్తిగా చెల్లించిన తర్వాతనే పబ్లిసిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను నిర్మాతల మండలి సదరు నిర్మాతకు ఇవ్వడం జరుగుతుంది.
    పారితోషికాల చెల్లింపులు వాయిదాల పద్ధతిలో ఉంటాయి. ఆఖరున 30 శాతం ఆపివేయబడి ఉంచి, ఆ మొత్తం సినిమా రిలీజు సమయంలో ల్యాబ్ క్లియరెన్స్ మార్గంలో చెల్లింపులు జరుగుతాయి.
    ప్రతిరోజూ షూటింగ్ లొకేషన్‌ లో కాల్ ‌షీట్ టైమింగ్స్ నమోదును విధిగా అందరూ పాటించాలి. ఇందులో చిన్న, పెద్ద మినహాయింపు లేదు.
    హీరో తన వ్యక్తిగత సిబ్బందిగా 4గురిని (మేకప్, టచప్, కాస్టూమ్ అసిస్టెంట్, బాయ్) పెట్టుకోవచ్చు. అదే హీరోయిన్ అయితే విషయంలో అదనంగా ఇంకొకరు(హెయిర్ డ్రెస్సర్) వుండొచ్చు. ఐదేళ్ల అనుభవం మించిన సహాయ నటీనటులు మాత్రం ఇద్దర్ని (మేకప్, టచప్ బాయ్) పనిలో పెట్టుకోవచ్చు.
    ఇకమీదట ఏ ఆర్టిస్టు కూడా వ్యక్తిగత మేకప్, కాస్ట్యూమ్స్ వంటి అవసరాల కోసం నిర్మాత అనుమతి లేకుండా వినియోగించరాదు.

    పైన పేర్కొన్న షరతుల్ని అతిక్రమించేలా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు 5 నుంచి 10 లక్షల వరకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఒక ఏడాది సినిమా నిర్మాణానికి వారు దూరంగా కూడా ఉండవలసివుంటుంది.

    పైన పేర్కొన్న షరతులన్నీ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలకు కూడా వెంటనే వర్తిస్తాయ. సంక్రాంతి అనంతరం ఈ నెల 17న అన్ని సినిమాల షూటింగులు తిరిగి మొదలవుతాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X