»   » అర్ధరాత్రి అమీర్‌ఖాన్ ఇంట్లో శ్రద్ధ.. మీడియా కంటికి..

అర్ధరాత్రి అమీర్‌ఖాన్ ఇంట్లో శ్రద్ధ.. మీడియా కంటికి..

Written By:
Subscribe to Filmibeat Telugu

దంగల్ తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించే చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో శ్రద్ధాకపూర్ ఎంపిక ఖారారైనట్టు సమాచారం. శనివారం రాత్రి శ్రద్ధాకపూర్ అమీర్ ఖాన్ నివాసం నుంచి రావడం మీడియా కంటపడి సెన్షేషనల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె ఆ చిత్రంలో నటిస్తుందనే వార్తలు గుప్పమంటున్నాయి.

గాఢమైన ముద్దు

గాఢమైన ముద్దు

బాలీవుడ్‌లో ఈ చిత్రం ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో తొలుత దంగల్ ఫేం ఫాతిమాను తీసుకోవాలని భావించారు. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌లో గాఢమైన ముద్దు సీన్‌ ఉన్నది. ఈ నేపథ్యంలో దంగల్‌లో కూతురిగా నటించిన ఆమెను ప్రేక్షకులు ఊహించుకోవడం కష్టమనే అభ్యంతరాన్ని నిర్మాత ఆదిత్య చోప్రా వ్యక్తం చేశాడట.

శ్రద్ధాకపూర్ చేజిక్కించుకొన్న అవకాశం

శ్రద్ధాకపూర్ చేజిక్కించుకొన్న అవకాశం

హీరోయిన్ పాత్రకు తొలుత ఆలియా భట్, లేదా వాణికపూర్‌ను తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఆ అవకాశం ప్రస్తుతం శ్రద్ధాకపూర్ చేజిక్కించుకొన్నట్టు బాలీవుడ్ మీడియా కథనాన్ని ప్రకటించింది.

యూరప్‌లో శ్రద్ధాకపూర్ జన్మదినం

యూరప్‌లో శ్రద్ధాకపూర్ జన్మదినం

ఇటీవల శ్రద్ధాకపూర్ తన 30 జన్మదినాన్ని జరుపుకొన్నది. అందుకోసం ఆమె యూరప్‌కు వెళ్లింది. యూరప్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టు నుంచి అమీర్‌ఖాన్‌ ఇంటికి వెళ్లినట్టు సమాచారం.

2018 దీపావళికి విడుదల

2018 దీపావళికి విడుదల

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రానికి ధూమ్3 డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2018 దీపావళికి విడుదల కానున్నది.

పురాతన నవలకు ఆధారం

పురాతన నవలకు ఆధారం

యాక్షన్, అడ్వెంచర్ చిత్రంగా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ రూపొందుతున్నది. ఈ సినిమా 1839 నాటి నవల ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్ బై ఫిలిప్ మిడోస్ టేలర్' ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

English summary
Shraddha Kapoor paying a visit to Aamir Khan has sparked speculation that she has been finalised for his upcoming film, Thugs of Hindostan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu