»   »  'శ్రియ'భిలాష

'శ్రియ'భిలాష

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shreya
బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి,టాలీవుడ్ నుండి కాలీవుడ్ కి వెళ్ళినా శ్రియకు తనవి తీరటం లేదు. 'శివాజీ' హిట్ తర్వాత వరస ఆఫర్లతో బిజీ గా ఉన్నా...కావల్సినంత డబ్బున్నా కొన్ని తీరని కోరికలు ఉన్నాయట. అందులో ఒకటి బిగ్ బి అమితాబ్ తో కలసి నటించటంట. ఈ తీరని అభిలాష కి బీజం ఆమె చిన్నప్పుడే పడిందిట. ఆమె 11 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఓ అభిమానిగా అమితాబ్‌ను కలిసి ఆటోగ్రాఫ్ తీసుకొన్నట్టు చెప్తోంది. ఉదయ్‌పూర్‌లో అమితాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇది జరిగిందని చెప్పింది.

అలాగే ఇప్పుడు తాను పెద్ద హీరోయిన్ అయ్యానని...ఎంతో అభిమానించి ఆటోగ్రాఫ్ తీసుకొన్న అమితాబ్ సరసన ఒక్క సినిమాలోనైనా నటించాలని ఉందని సన్ని హితులతో చెప్పుకుంటోందిట . ఇటీవల బ్యాంకాక్‌లో ఓ సినిమా అవార్డుల ప్రధాన కార్యక్రమంలో అమితాబ్‌ను కలుసుకొన్పప్పుడు "మీతో నటించాలనుంది' అని అమితాబ్‌తో అన్నట్టు చెప్పింది. అమితాబ్ సైతం "నాకూ మీతో నటించాలనుంద' ని మనసులో మాట చెప్పిందిట. దానికి ఆయన పూర్తి స్ధాయిలో స్పందించినట్టు తెలిపింది. అయితే ఆ అభిలాష ఎప్పుడు తీరనుందనేది ఆయన సూచన ప్రాయంగా మాత్రమే చెప్పారుట.

అయితే ఇదంతా శ్రియ బాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికి ఆమె అనుసరించే సెల్ఫ్ మార్కెటింగ్ స్కిల్స్ అని తోటి హీరోయిన్లు అంటున్నారు.ఇంతకు ముందు కూడా రజనీ,విక్రమ్ ల ప్రక్కన ఇవి ప్రదర్శించిందని చెప్పుతున్నారు. అయినా ఈ రహస్యం తెల్సిన వాళ్ళూ ట్రైల్స్ వేయచ్చుకదా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X