»   » వయస్సు దాచుకోవడానికి శ్రియ పాట్లు...!

వయస్సు దాచుకోవడానికి శ్రియ పాట్లు...!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్ అందాల నటి శ్రియ తన వయస్సును దాచి పెట్టేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఇందుకోసం మద్యం బాబులను తనకు ఉదారహణగా తీసుకుంటున్నారు. మన దేశంలో పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు ఉందన్నారు. అయితే, మద్యం సేవించేందుకు మాత్రం 25 సంవత్సరాలు ఉండాలని నిబంధన ఇవ్వడం సబబుగా లేదన్నారు.

  ఇంతకూ ఇలాంటి వివాదాస్పద వాఖ్యలు ఎందుకు చేసిందా అంటే ఏదో ఒక విషయంతో మీడియాలో తన పేరు ఉండాలన్న అమ్మడి ప్లానేనట. ఈ విషయమై ఆమెనే అడిగితే..అదేం కాదు. ఇరవై ఐదేళ్లు దాటిన వాళ్లకే మద్యం అమ్ముతారంటే నాకు కూడా అసూయగానే ఉంది. ఎందుకంటే..నాకు అమ్మరు అన్న దానికి అసూయగా ఉంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.

  అంటే ఈ లెక్కన ఇరవై ఐదేళ్లు ఇంకా దాటలేదని శ్రియ చెపుతోంది. అయితే, ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమకు వచ్చి 12 యేళ్లు అయినప్పటికీ.. శ్రీయకు ఇంకా ఇరవై ఐదేళ్లు దాటలేదంటే ఎవరు నమ్ముతారు?. వయస్సు దాచుకున్నా అది ఎదుటివాళ్లు గుర్తు పట్టని విధంగా మార్చుకోవాలి కానీ ఇలాంటి చీఫ్ స్టేట్‌ మెంట్‌లతో కాదు కదా అంటున్నారు మీడియా. మొత్తానికి తన వయస్సు దాచుకోటానికి శ్రియ పడరాని పాట్లు పడుతోందన్నమాట.

  ప్రస్తుతం శ్రియ, అల్లరి నరేష్‌, తో జోడీ కట్టబోతున్నారు. దీవానా మస్తానా(1997) టైటిల్ తో హిందీలో వచ్చి హిట్టైన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తూ ఈ జంట తెరకెక్కబోతోంది.

  English summary
  Shriya Saran might well have got herself in trouble again. The actress has said that it is really absurd to raise the legal age for drinking to 25 when people are allowed to vote and get married when they are 18 years of age.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more