For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మీనా పాత్రలో శ్రియ...నదియా పాత్రలో టబు

  By Srikanya
  |

  హైదరాబాద్ :ఇద్దరు పిల్లల తల్లిగా 'దృశ్యం'లో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది మీనా. మలయాళం, తెలుగు రెండు భాషల్లోనూ ఆమే నటించింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అందులో మీనా స్థానంలో ఎవరు చేస్తారనే ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం దొరికింది. ఈ పాత్ర కోసం శ్రియను ఎంచుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ''చాలా తర్జనభర్జనల తర్వాత కథానాయిక పాత్ర కోసం శ్రియను ఎంచుకున్నాం. ఆ పాత్రకు ఆమె నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం. ఇలాంటి ఆలోచనతోనే డీజీపీ పాత్రను టబుకు అప్పగించాం'' అని చెబుతున్నాయి చిత్రవర్గాలు. అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది.

  మోహన్‌లాల్‌, మీనా కీలక పాత్రధారులుగా జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘దృశ్యం'. అక్కడ ఘనవిజయం సాధించిన చిత్రమిది. వెంకటేశ్‌, మీనా జంటగా అదే టైటిల్‌తో శ్రీప్రియ తెలుగులో, వి.రవిచంద్రన్‌ హీరోగా పి.వాసు కన్నడలో రీమేక్‌ చేయగా ఇరు ప్రేక్షకులను అమితంగా అలరించిందీ చిత్రం. తమిళంలో కమలహాసన్‌ తెరకెక్కిస్తున్నారు. దక్షిణాది భాషలన్నింటిలోనూ రూపొందిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించబోతోంది. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ‘దృశ్యం' హిందీ రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకొంది.

  Shriya Saran to play Ajay Devgn’s wife in the Drishyam remake

  ఇక మరో ప్రక్క ఈ చిత్రానికి మూలమైన నవల 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని అక్కడ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో కత్రినా కైఫ్‌ నటించబోతున్నట్లు బాలీవుడ్‌ సమాచారం. 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌'. ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన నవల. కేగో హిగాషినో రచించిన ఈ నవల జపాన్‌లో ఎన్నో అత్యుత్తమ అవార్డులు అందుకొంది. ఈ కథను బాలీవుడ్‌ వెండితెరపై చూపించాలనుకుంటున్నారు దర్శకుడు సుజయ్‌ ఘోష్‌. దీన్ని ఏక్తా కపూర్‌ నిర్మిస్తారు.

  ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు కత్రినా కైఫ్‌ని సంప్రదించడంతో పాటు ఆమెకు ఈ పుస్తకాన్నీ పంపించారట. కత్రినాకు ఈ కథ నచ్చడంతో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది. ఇక ఇప్పటికే దక్షిణాదిన 'దృశ్యం' సినిమా రిలీజై ఆకట్టుకుంటోంది. తొలుత మలయాళంలో జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది.

  మలయాళంలో యాభైకోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న ఒక కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే పాయింట్‌తో తీసిన ఈ చిత్రం రీమేక్‌ హక్కులు తీసుకుని కన్నడ, తెలుగు భాషల్లో రూపొందించారు. తెలుగు చిత్రంలో వెంకటేశ్‌, మీనా నటించగా సీనియర్‌ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు.

  తెలుగు 'దృశ్యం' ఇటీవలే విడుదలై సక్సెస్‌బాటలో ఉంది. ఇప్పుడు 'దృశ్యం' కథపై వివాదం మొదలైంది. జపాన్‌ భాషలో వచ్చిన 'ది డివోషన్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' అనే నవలా హక్కులను ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏక్తాకపూర్‌ తీసుకున్నారు. హిందీలో చిత్రం నిర్మించే ఆలోచనతో ఉన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణ ఏమంటే నవలలోని ప్రధానాంశాలను ఆధారంగా చేసుకుని 'దృశ్యం' సినిమా తీశారనేది.

  English summary
  Shriya Saran, who balances her career between South Indian cinema and Bollywood, has been signed to play Ajay Devgn's wife in the Nishikant Kamat film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X