శ్రుతిహాసన్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్టు..షాక్

తన సోదరుడి ఉద్యోగ ప్రయత్నం కోసం శ్రుతి ఇంటికి వెళ్తే ఆమె అపార్థం చేసుకుని తనని బయటకు నెట్టివేసిందని నిందితుడు చెప్పినట్లు వెల్లడించారు. తాను ఎందుకు వచ్చాడో చెప్పేలోపే ఆమె తలుపులు మూసేందుకు ప్రయత్నించిందని, ఆ సమయంలోనే ఆమె గాయపడిందని నిందితుడు చెప్పాడు.
మీడియా కథనాల ప్రకారం - శ్రుతిహాసన్ తలుపు తీయగానే దుండగుడు ఆమె గొంతు పట్టుకుని తోసేసి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఆమె అతని ముఖం మీద తలుపును వేయడంతో అతని చేయికి దెబ్బ తాకింది. ఆమె వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. దాంతో అతను పారిపోయాడు.
ఆ ఆకస్మిక సంఘటనతో శ్రుతి హాసన్ భీతిల్లినట్లు చెబుతున్నారు. శ్రుతిహాసన్ ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కూతురు. ఆమె ముంబైలో అపార్టుమెంటు కొనుక్కుని అక్కడే ఉంటోంది. ఆమె తెలుగులో గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా వంటి చిత్రాల్లో నటించింది. ఈ సంఘటనపై శ్రుతిహాసన్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఆమె తీవ్రంగా వణికిపోయిందని ఆమె అధికార ప్రతినిధి చెప్పినట్లు ఎన్డీటివీ తెలియచేసింది.


Click it and Unblock the Notifications











