»   » కౌగిలి తప్ప ఏమివ్వగలను.. నేను వాటిని పట్టించుకొను.. శృతిహాసన్

కౌగిలి తప్ప ఏమివ్వగలను.. నేను వాటిని పట్టించుకొను.. శృతిహాసన్

Written By:
Subscribe to Filmibeat Telugu

బహుముఖ ప్రజ్హాశాలి శృతిహాసన్ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను సాధించింది. ట్విట్టర్ అకౌంట్‌లో ఆమెను దాదాపు 50 లక్షల మందికి పైగా ఫాలోఅవుతున్నారు. దాంతో అత్యధిక మంది ఫాలో అవుతున్న ప్రముఖుల్లో శృతిహాసన్ ఒకరుగా మిగిలారు.

Shruti Haasan

గబ్బర్ సింగ్, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకొన్న శృతి హాసన్ తన ట్విటర్‌లో రికార్డు స్థాయి ఫాలోవర్స్ చేరడంపై ఆమె స్పందించారు.

 50 లక్షల మందికి థ్యాంక్యూ..

50 లక్షల మందికి థ్యాంక్యూ..

మంచి మనసు ఉన్న 50 లక్షల మంది ప్రజల్లారా థ్యాంక్యూ.. మీరు కురిపిస్తున్న ప్రేమ, అందిస్తున్న ఆదరణ మరువలేనివి. ఈ సందర్భంగా మీ అందరికి కలిపి ఒక పెద్ద కౌగిలి ఇవ్వడం తప్ప ఏమి చేయలేను అని శృతిహాసన్ ట్వీట్ చేసింది.

సోషల్ మీడియాతో అనుసంధానం

సోషల్ మీడియాతో అనుసంధానం

సోషల్ మీడియాతో అనుసంధానం కావడం గొప్ప బలమని గట్టిగా నమ్ముతాను. అభిమానుల కోసం నేను స్వయంగా ట్వీట్ చేస్తాను. నేను అంకెలు, సంఖ్యలను పెద్దగా పట్టించుకొను. మీరు ఎలా అలాంటి నంబర్లను తెచ్చుకొంటారో నాకు మాత్రం తెలియదు అని శృతిహాసన్ ఇటీవల మీడియాతో అన్నారు.

సంఘమిత్ర సినిమా కోసం

సంఘమిత్ర సినిమా కోసం

ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ నిర్మించే సుభాష్ నాయుడు, తమిళ చిత్రం సంఘమిత్ర చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే బహెన్ హోగి తేరి అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తున్నది. సంఘమిత్ర సినిమా కోసం యుద్ధ విన్యాసాల శిక్షణ పొందుతున్నది.

అత్యంత భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర

అత్యంత భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర

తమిళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఇంతకుముందు లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని కుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సీ డైరెక్షన్‌లో రూపొందుతున్నది. ఈ చిత్రంలో ఆర్య, జయం రవి నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం యుద్ద విన్యాసాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్టు శృతిహాసన్ ట్వీట్ చేశారు.

English summary
Shruti Haasan has reached another milestone in social media. Her account in twitter got five million followers on Twitter. "Thankyou beautiful people for my five million ! Your love and support means so much to me !!!! wish I could give a giant group hug !!" she has tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X