For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నాకు తెలియకుండానే నా పెళ్లికార్డులు.. అతడు ప్రత్యేకమైన వ్యక్తి.. ఆ భయం లేదు.. శ్రుతిహాసన్

  By Rajababu
  |

  విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రుతిహాసన్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకొన్నది. తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో రాణించింది. తాజాగా కొంత సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నది. అంతేకాకుండా బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో పెళ్లి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రుతిహాసన్ తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ వెల్లడించింది. పలు విషయాలపై ఆమె ఏమన్నారంటే..

   వ్యక్తిగత జీవితం లేదు

  వ్యక్తిగత జీవితం లేదు

  సినీ కుటుంబ నేపథ్యం నుంచి చిత్ర పరిశ్రమలోకి రావడం కారణంగా నాకు వ్యక్తిగత జీవితమంటూ లేకపోయింది. సినీ తారగా నా జీవితం పబ్లిక్‌గా మారింది. అది నాకు విసుగు తెప్పించే అంశం. ఇతరుల వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ప్రయత్నం మరొకరు చేయకుంటే బాగుండేది అనిపిస్తున్నది.

  ఎన్నో రూమర్లు సృష్టించారు.

  ఎన్నో రూమర్లు సృష్టించారు.

  నా జీవితానికి మరొకరి పేరు చేర్చి ఎన్నో రూమర్లు సృష్టించారు. వారు అలా ఆనంద పడితే ఏం చేయలేని పరిస్థితి. వారి అలా ఆనంద పడితే ఏం చేయగలం చెప్పండి.

   అఫైర్లు, పెళ్లి అంటూ రాతలు

  అఫైర్లు, పెళ్లి అంటూ రాతలు

  అఫైర్లు, పెళ్లి అంటూ నానా రకాలుగా వార్తలు రాస్తున్నారు. నాకు తెలియకుండా నా పెళ్లి డిసైడ్ చేస్తున్నారు. నాకు తెలియకుండా పెళ్లికార్డులు కొట్టించి పంపేలా ఉన్నారు.

   నా జీవితంలో ఎవరైనా ఉంటే

  నా జీవితంలో ఎవరైనా ఉంటే

  నా జీవితంలోకి ఎవరైనా వ్యక్తి వచ్చాడనిపిస్తే నేను ఆ విషయాన్ని కచ్చితంగా చెబుతాను. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదు. రెండేళ్ల తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానో లేదు చెప్పలేను.

   మైఖేల్ ప్రియమైన స్నేహితుడు

  మైఖేల్ ప్రియమైన స్నేహితుడు

  మైఖేల్ కోర్సలే నాకు ప్రియమైన స్నేహితుడు. అతను నాకు ప్రత్యేకమైన వ్యక్తి. అంతకుమించి ఆయన గురించి నేను చెప్పలేను. ఇంకా ఏమైనా చెబితే మరో రకంగా మాట్లాడే అవకాశం ఉంది. నా జీవితం నాకు వ్యక్తిగతమైంది. నా గురించి అన్ని చెప్పడం ఎలా కుదురుతుంది.

  మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో

  మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో

  బలమైన మహిళా నేపథ్యం ఉన్న కథలు, పాత్రలు చేయాలనిపిస్తున్నది. శ్రీమంతుడు, ప్రేమమ్ చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. అలా నాకు పేరు తెచ్చే పాత్రలనే చేయాలనుకొంటున్నాను. నటిగా నన్ను సంతృప్తి పరిచే పాత్రలను చేయాలనుకొంటున్నాను.

   వెనుక బడిపోతాననే భయం లేదు

  వెనుక బడిపోతాననే భయం లేదు

  సినిమాలు చేయకపోతే నేను నటిగా పోటీలో వెనుకబడిపోతాననే భయం లేదు. డబ్బు మీద ఆసక్తి లేదు. జీవితంలో సంతోషంగా ఉన్నామా లేదా అనే నాకు ముఖ్యం. తీరికలేకుండా ఏది పడితే అది చేసుకొంటూ పోతే జీవితంలో ఏమి సాధించామనే ప్రశ్న మొదలవుతుంది. బయట ప్రపంచాన్ని కూడా చూడాల్సిన అవసరం నాకు ఉంది.

  హీరోయిన్ల గురించి పట్టించుకోను

  హీరోయిన్ల గురించి పట్టించుకోను

  వేరే హీరోయిన్ల గురించి పట్టించుకొను. వారిపై కామెంట్ చేయను. ఎవరైనా నా కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారంటే సంతోషపడుతాను. వారి కష్టానికి ఫలితం అని భావిస్తాను.

   ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు

  ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు

  ఆడవారికి ఆడవాళ్లే శత్రువులుగా మారుతున్నారు. ఒకరు ఉన్నతస్థాయికి చేరితే అసూయ పడను. కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకొన్న ఏ అమ్మాయైనా ఇతరులకు ఆదర్శం అవుతుంది. ఒక మహిళ బాగుపడితే అందరూ ఆనందించే రోజులు రావాలి.

  English summary
  Shruti Haasan and her rumoured London-based actor boyfriend Michael Corsale and mother Sarika were snapped in Mumbai. The pictures are making fans think that Shruti's mom Sarika approves of the relationship. Shruti Haason responded about her personal life with media recently.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more