For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను చేయటం లేదు.. శృతిహాసన్ ఖండన

  By Srikanya
  |

  హైదరాబాద్ : "నేను ఏదన్నా సినిమా చేస్తే...తప్పకుండా మీకు చెప్తాను..దయచేసి స్పెక్యులేట్ చెయ్యద్దు ", అంటోంది శృతి హాసన్. హఠాత్తుగా ఏమిటీ ఇలా మాట్లాడుతోంది అంటారా...దీనికి కారణం..ఆమె వెంకటేష్ ప్రక్కన ఆమె కనిపించబోతోందంటూ వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆమె ఇలా ఖండించింది. వెంకటేష్ వంటి సీనియర్ హీరో సరసన ఆమెకు ఆఫర్ వచ్చింది..ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమంది.

  ఇంతకీ ఆమెను ఒప్పించిన దర్శకుడు దశరథ్ అంటున్నారు. గ్రీకు వీరుడు అంటూ డిజాస్టర్ ఇచ్చిన దశరథ్ ఇప్పుడు మరో చిత్రం వెంకటేష్ తో చేయటానికి సిద్దమవుతున్నారు. అందుకోసమో ఆమెను సంప్రదించినట్లు చెప్పుకున్నారు. అయితే ఆమెను సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే ఆమె డేట్స్ ఇవ్వలేదని అని చెప్పుకుంటున్నారు.

  పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

  Shruti Haasan Quashes Rumours

  అందుతున్న సమాచారాన్ని బట్టి.... ఇటీవలే దశరథ్ వెంకటేష్ ని కలిసి ఓ కథని చెప్పారు.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. వెంకటేష్ ఫైనల్ కథని ఓకే చేస్తే వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇద్దరూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన వారే కాబట్టి వీరిద్దరి నుంచి ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఆశించవచ్చు. ఈ సినిమా అధికారిక అనౌన్స్ మెంట్ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  ''మొదట్లో నన్నందరూ ఐరెన్‌లెగ్‌ అన్నారు. కొన్ని విజయాలు సాధించగానే గోల్డెన్‌లెగ్‌ అని పిలిచారు. ఈ రెండింటినీ నేను పట్టించుకోలేదు. ఇమేజ్‌లు ఇక్కడ శాశ్వతం కాదు. అందుకే వాటి గురించి ఆలోచించకుండా నా పని నేను చేసుకొంటూ పోతున్నానంతే. పొగడ్తలు, విమర్శల లెక్కలేసుకొంటూ కూర్చుంటే ఒక్క అడుగూ వేయలేం'' అంటోంది శృతి హాసన్.

  కెరీర్ ప్రారంభంలో శృతి నటించిన సినిమాలు ఏమీ ఆడలేదు. దాంతో అంతా ఆమెకు ఐరన్ లెగ్ అని పెట్టారు. అయితే గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవటంతో ఆమెకు మళ్లీ క్రేజ్ వచ్చింది. హీరోలు, దర్శకులు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వీటి గురించి ఆమె ఇలా ప్రస్తావిస్తూ మాట్లాడింది.

  అలాగే... ''ఒక్క సినిమాతోనే ఎవ్వరూ గొప్పవాళ్లు కాదు. కొన్ని విజయాలతో అంతా సాధించేసినట్టు కాదు. గెలిచిన రోజు అంతా బాగానే ఉంటుంది. ఒక్క ఫెయిల్టూర్ ఎదురైతే అంతా తారుమారే'' అంటోంది శ్రుతిహాసన్‌.

  శ్రుతిహాసన్‌. సినిమాల విషయానికొస్తే ....రీసెంట్ గా 'ఆగడు'లో ప్రత్యేక గీతంలో కనిపించి కనువిందు చేసింది. ఇప్పుడు మహేష్‌బాబు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. కమల్‌హాసన్‌ కూతురిగా కాదు శ్రుతిహాసన్‌గా తానేంటో నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటుందీ హీరోయిన్. అందులో విజయం సాధించింది కూడా. ఇప్పుడు ఆమెకు తెలుగు, తమిళంలో పెద్ద హీరోలు, బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె డేట్స్ కోసం ఆగటానికి కూడా హీరోలు సిద్దపడుతున్నారు.

  ప్రస్తుతం శ్రుతిహాసన్‌ తెలుగు, తమిళం, హిందీల్లో ఆరు సినిమాలతో బిజీగా ఉంది. హిందీ 'తేవర్‌'లో ఐటం సాంగ్ లో డాన్స్ చేసింది. ఆగడు చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా...శ్రుతి హాసన్ డాన్స్ కు మంచి పేరు వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా మారింది.

  English summary
  "When I'm part of a film, I shall let you know. Please don't speculate", says Shruti Haasan, with all due to respect to every media house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X