»   » ‘బలుపు’ రెస్పాన్స్‌పై శృతి హాసన్ ట్వీట్

‘బలుపు’ రెస్పాన్స్‌పై శృతి హాసన్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రవితేజ-శృతి హాసన్ జంటగా రూపొందిన 'బలుపు' మూవీ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్ విత్ ఎంటర్టెన్మెంట్ మూవీ కావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో బలుపు యూనిట్ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు.

కాగా...బలుపుకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో హీరోయిన్ శృతి హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. 'ఈ చిత్ర విజయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అందరికీ కృతజ్ఞతలు' అని ట్వీట్ చేసింది. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత శృతి హాసన్‌కు తెలుగులో దక్కిన రెండో విజయం ఇదే.

Balupu

ఇక హీరో రవితేజ కెరీర్‌కు 'బలుపు' చిత్రం బూస్ట్ ఇచ్చిందని చెప్పుచ్చు. వరుసు ప్లాపులతో ప్రేక్షకులను నిరాశపరుస్తూ వచ్చిన రవితేజ 'బలుపు'తో వారి మనసు గెలిచాడని చెప్పొచ్చు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో మరో మెట్టు పైకెక్కారు. గోపీచంద్ డైరెక్షన్ స్టైల్ బాగుందని, అతనికి మంచి భవిష్యత్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావూ రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జైప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:కోన వెంకట్, పాటలు:సిరివెనె్నల, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, కెమెరా:జయనన్ వినె్సంట్, సంగీతం:తమన్.ఎస్.ఎస్. నిర్మాత:పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.

English summary
“Thankyou all for your heartfelt tweets about balupu it means a lot to me happy to make you laugh :p love you tweeps !! Xoxo,” Shruti Haasan posted on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu