»   » మెగాస్టార్ కూతురా..మజానాకానా, ర్యాప్ వాక్ చేసి రచ్చ చేసింది (ఫొటోలు)

మెగాస్టార్ కూతురా..మజానాకానా, ర్యాప్ వాక్ చేసి రచ్చ చేసింది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోయిన్స్, మోడల్స్ ర్యాంప్ పై నడవటం , మీడియా కవరేజ్ చేయటం అతి సాధారణం. అయితే అప్పుడప్పుడూ పేజీ త్రీ గర్ల్స్ కూడా ర్యాంప్ పై వాక్ చేస్తారు. కానీ ఈ సారి మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయ శ్వేతా బచ్చన్ నందా ఓ ఫ్యాషన్​ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. ముంబైలో జరిగిన ఈ షోలో 42 ఏళ్ల శ్వేత తెల్లని వస్త్రాలు ధరించి తళుక్కున మెరిశారు. ఈ షోలో ఆమె టాపర్ గా నిలిచారు.

శ్వేత పాల్గొన్న ఫ్యాషన్ షోను తిలకించేందుకు ఆమె తల్లిదండ్రులు జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ విచ్చేశారు. అభిషేక్ బచ్చన్ కూడా ఈ షోకు వచ్చి సోదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ షోలో శ్వేత నడుస్తున్నప్పుడు అమితాబ్ మొబైల్ తో వీడియో తీశారు.

షూటింగ్ తో బిజీగా ఉన్నా అభిషేక్ తీరిక చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే, దర్శకుడు అభిషేక్ కపూర్, ఆమె భార్య ప్రగ్నా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఫొటోలు మీరు ఈ క్రింద చూడవచ్చు.

అందరి దృష్టీ ఆమెపైనే

అందరి దృష్టీ ఆమెపైనే

తెలుపు రంగు దుస్తులను ధరించిన శ్వేత... ప్రేక్షకుల దృష్టిని తనవైపు లాగేసుకుంది. తమ ముద్దుల కూతురు పాల్గొన్న షోను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కూడా తరలివచ్చారు. సోదరుడు అభిషేక్ కూడా వచ్చి శ్వేతకు శుభాకాంక్షలు తెలిపాడు.

దూరంగా ఆమె ...

దూరంగా ఆమె ...

సాధారణంగా మీడియా ప్రపంచానికి దూరంగా ఉండే ఈమె , ఓ ఫ్యాషన్​లో పాల్గొని ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేయటం అందరిని ఆకర్షించింది.. సరికొత్త లుక్ లో డిజైనర్లు తయారు చేసిన తెల్లని డ్రెస్సుని ధరించిన శ్వేతాబచ్చన్ నంద ను చూసి ఫోటోగ్రాఫర్లు పండగా చేసుకున్నారు.

వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్

వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్

74 ఏళ్ల అమితాబ్ తన కుమార్తె లా ర్యాంప్ వాక్ చేయటం చూసి మురిసిపోయారు. ఆయన ట్విట్టర్ లో శ్వత గురించి రాస్తూ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ డాటర్ అంటూ ప్రశంశలు వర్షం కురిపించారు. అంతేకదా ఏ తండ్రికైనా తన కుమార్తె గురించి అందరూ మాట్లాడుతూంటే వచ్చే ఆనందం వేరు కదా.

అందరికంటే ముందుగా

అందరికంటే ముందుగా

అంతేనా అమితాబ్ తన కుమార్తె ఫొటోలను అందరికంటే ముందుగా ఫేస్ బుక్, ట్విట్టర్ లలో షేర్ చేసేసి, తన అభిమానులతో ఆ ఆనందం పంచుకున్నారు. ఆయన తొలి నుంచి తన కుమార్తె అంటే విపరీతమైన ప్రేమ. ఈ సారి మరోసారి బహిరంగమైంది. తండ్రిగా తాను గర్విస్తున్నాను అన్నారు.

స్టైల్ స్టేట్ మెంట్

స్టైల్ స్టేట్ మెంట్

పోగ్రాం అయ్యాక మీడియాతో మాట్లాడుతూ... తను చాలా క్యాజువల్ గా ఉండటానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. అలాగే జీన్స్ , టీ షర్ట్ లు వేసుకోవటం తనకు ఇష్టమని, అయితే రాత్రిళ్లు ప్యామిలీతో బయిటకు వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులు వాడతానని చెప్పారు.

ఎంత ఆనందమో

ఎంత ఆనందమో

తను చేసిన ఈ ఈవెంట్ కు తన కుటుంబం మొత్తం రావటం, తనను అభినందించటం ఆమెను సంతోషంలో ముంచెత్తింది. ముఖ్యంగా తన సోదరుడు, తన తండ్రి, తల్లి వచ్చి పోగ్రాం అయ్యాక తనను హగ్ చేసుకుని ప్రసంశించటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా పేర్కోంది.

అభిషేక్ ని ఈ ప్రశ్న అడిగారు

అభిషేక్ ని ఈ ప్రశ్న అడిగారు

ఇక అబిషేక్ బచ్చన్ ని మీడియా వారు ..మీరు మీ భార్య ఐశ్వర్యారాయ్ నటించిన యే దిల్ హై ముష్కిల్ చిత్రం చూసారా అని అడిగితే లేదని, తాను ఫుట్ బాల్ టీమ్ తో బిజీగా ఉన్నానని అన్నారు. అలాగే అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే తనకి ఈ సినిమా అద్బుతంగా వస్తుందని తెలసని, ఐశ్వర్యారాయ్ ని అద్బుతంగా దర్శకుడు కరణ్ జోహార్ చూపించారని తెలియచేసారు.

English summary
Amitabh Bachchan's daughter Shweta Bachchan Nanda walked the ramp for noted designer duo Abu Jani-Sandeep Khosla's label 'Jani Khosla' and we gotta admit that she was looking exceptionally gorgeous!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu