twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేవుడువయ్యా' : మహేష్ ని మెచ్చుకున్నారు(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ :తన తాజా చిత్రం 'శ్రీమంతుడు' లో గ్రామాల దత్తత అంశాన్ని ప్రస్తావించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిజ జీవితంలోనూ తెలుగు రాష్ట్రాల్లోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వాటిలో బుర్రిపాలెం ఆంధ్రప్రదేశ్ కి చెందినది కాగా మహబూబ్ నగర్ జిల్లాలోని సిద్దాపురం గ్రామం తెలంగాణకి చెందినది.

    ఇందుకుగాను సిద్దాపురం గ్రామస్థులు మహేష్ ని కలిసి శుభాభినందనలు తెలిపారు. బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో వున్న మహేష్ ను సిద్దాపురం గ్రామస్తులు కలిసి తమ గ్రామాన్ని సందర్శించాల్సిందిగా కోరారు.

    తమ గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్నందుకు ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాదర్ గోరి అధ్వర్యంలో గ్రామస్థులు సూపర్ స్టార్ మహేష్ ను కలిసి తమ ధన్యవాదాలను తెలియజేశారు.

    స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి...

    వీరంతా...

    వీరంతా...

    గ్రామ సర్పంచ్ ఎర్రోజు నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్య సహా శివాజీ యూత్ సహా యువజన సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.

    ఆప్యాయంగా..

    ఆప్యాయంగా..

    బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉన్న మహేష్ అందరినీ కలిసి వారితో అప్యాయంగా మాట్లాడారు.

    మాట ఇచ్చారు.

    మాట ఇచ్చారు.

    తమ గ్రామానికి మహేష్ ను రావాల్సిందిగా మహేష్ ను కోరారు. మహేష్ కూడా తప్పకుండా వస్తానని చెప్పారు.

    ఊపందుకరుంది

    ఊపందుకరుంది

    కోటీశ్వరుడైన ఓ వ్యక్తి గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై 'శ్రీమంతుడు' చిత్రం కథ ఆధారపడి ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేపథ్యంలో గ్రామాల దత్తత కార్యక్రమం వూపందుకున్న విషయం తెలిసిందే.

    కొనియాడారు

    కొనియాడారు

    మరో ప్రక్క తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.

    English summary
    Siddapuram villiagers met Mahesh Babu under the All India Krishna Mahesh Fans president Khadar's leadership and thanked him. Sarpanch of the villiage Erroju Narsamma, MPTC Balayya and others invited Mahesh Babu to visit their village. The actor ,who was busy in Brahmotsavam shooting has accepted their invitation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X