»   » సిద్దార్ధ కొత్త సినిమా స్టోరీ లైన్ ఇదే....

సిద్దార్ధ కొత్త సినిమా స్టోరీ లైన్ ఇదే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిదార్ధ హీరోగా చందన్ అరోరా దర్శకత్వంలో స్టూడియో 18 సంస్థ నిర్మించిన 'స్త్ట్రెకర్‌' చిత్రం ఈ రోజే(శుక్రవారం) అంతటా రిలీజవుతోంది. ఈ చిత్రంలో కథ క్యారమ్స్ ఆట చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో సిద్దార్ధ సూర్య అనే పాత్రను పోషించాడు. కథ ప్రకారం నిరు పేద కుటుంబంలో పుట్టిన సూర్య సరైన జీవితాన్ని గడపలేడు. అందులోనూ అతన్ని ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో స్కూల్ కు వెళ్లడు. ఇంటి దగ్గరే ఉంటున్న అతనికి వాళ్ల సోదరుడు క్యారమ్స్‌ ఆడటం నేర్పిస్తాడు. అందులో అతను ఆరితేరిపోతాడు. జూనియర్‌ క్యారమ్స్‌ ఛాంపియన్‌ షిప్‌ ను 12 ఏళ్ల వయసులోనే కైవసం చేసుకుంటాడు. ఆ తరవాత దుబాయ్‌ వెళ్లడం కోసం రూపాయి రూపాయి కూడబెడుతూ పెద్దవాడవుతాడు. ఓ మోసగాడి చేతుల్లో ఆ డబ్బులు పోసి ఘోరంగా మోసపోతాడు. ఆ తరవాత క్యారమ్స్‌పై మరలా దృష్టి నిలిపి తను ఏం సాధించాడన్న స్టోరీ పాయింటుతో ఈ చిత్రం హిందీలో రూపొందింది. ఇక చిత్ర దర్శకుడు చందన్‌ అరోరా గతంలో రామ్ గోపాల్ వర్మ కంపెనీ, బల్కీ చీనీకామ్ చిత్రాలకు ఎడిటర్ గా చేసాడు. అలాగే దర్శకుడుగా మై మేరీ పత్నీ అవుర్ ఓ, మై మాధురీ దీక్షిత్ బనా చాహతా హూ చిత్రాలను డైరక్ట్ చేసాడు. ఇక ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య పంచోలీ, పద్మప్రియ, సీమా బిశ్వాస్‌, విద్యా మాల్వేది తదితరులు నటించారు. తెలుగులోనూ డబ్బింగ్ చేసారు. పద్మప్రియ హీరోయిన్ గా చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu