»   » నిర్మాతగా మారుతున్న హీరో సిద్దార్ధ

నిర్మాతగా మారుతున్న హీరో సిద్దార్ధ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్దార్ధ వచ్చే సంవత్సరం నుంచి నిర్మాతగా మారుతున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో చెపుతూ...నేను వచ్చే సంవత్సరం నుంచి సొంతంగా నిర్మాణ సంస్ధ ప్రారంభిస్తున్నాను. మరి కొద్ది నెలల్లో ఈ మేరకు ప్రకటన ఇస్తాం. అలాగే కాన్సెప్ట్ డ్రైవెన్ సినిమాలు చేస్తాము. ఈ మేరకు ఫండ్స్ ని సమీకరిస్తున్నాం అన్నారు. ప్రస్తుతం సిద్దార్ధ...కె రాఘవేద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ రావు దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే బావ అనే మరో రొమాంటిక్ కామిడీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రాంబాబు అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. రాజేంద్రప్రసాద్ ఆ చిత్రంలో కీలకమైన పాత్ర చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu