»   » సమంతతో వివాహం గురించి సిద్దార్ధ ట్విస్ట్

సమంతతో వివాహం గురించి సిద్దార్ధ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సమంత, సిద్దార్ద ల మధ్య లవ్ స్టోరీ రన్ అవుతోందని, త్వరలోనే వాళ్లిద్దరూ వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సిద్దార్ధ మీడియాతో ఈ ప్రేమ వివాహం విషయమై మాట్లాడాడు.

తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లాడుతానని సిద్ధార్థ స్పష్టం చేశాడు. నటి సమంతతో ప్రేమలో ఉన్నారటగా? పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయిగా అని ప్రశ్నిస్తే.. సహజంగా నిప్పులేంది పొగ రాదంటారు. నా విషయంలో నిప్పు లేకపోయినా పొగమాత్రం వస్తోంది. నా సినీ కెరీర్‌ ప్రస్తుతానికి ప్రశాంతంగా సాగుతోంది. అలాంటి సమయంలో ఇలాంటి వదంతులకు స్పందించేందుకు సిద్ధంగా లేను. ఇక పెళ్లి విషయం అంటారా.. తల్లిదండ్రులు చూసే అమ్మాయినే చేసుకుంటాను అన్నారు.

సుందర్‌.సి దర్శకత్వంలో నటించిన 'సమ్ థింగ్ సమ్ థింగ్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన 'కలగలప్పు' చూశాను. చాలా నచ్చింది. ఓ కార్యక్రమంలో సుందర్‌.సి ని కలుసుకున్నప్పుడు నాతో సినిమా తీయాలని అడిగాను. ఇప్పటి వరకు నేను అలా ఎవరినీ అడిగింది లేదు. వెంటనే ఆయన కూడా అంగీకరించటంతో 'సమ్ థింగ్ సమ్ థింగ్ ' తెరకెక్కింది. అందరినీ అలరిస్తుందని సిద్ధార్థ సమాధానమిచ్చాడు.


సిద్దార్థ్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మానందం ఈ చిత్రంలో లవ్ గురు గా హైలెట్ కానున్నారు. ఇందులో సిద్దార్ద పాత్ర పేరు కుమార్.

చిత్రం కథ గురించి దర్శకుడు సుందర్. సి. మాట్లాడుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేయాలన్నది కుమార్‌ ఉద్దేశం. చేసే పనిలో కష్టం ఉన్నా ఫలితం మధురంగా ఉంటుందని అతనికి చెప్పిందెవరు? అతని ఆలోచనల్ని మార్చాలని ప్రయత్నించినవాళ్లకి ఎదురైన అనుభవాలేమిటన్నది తెర మీదే చూడాలన్నారు.

English summary
Siddharth and Samantha's secret relationship has become a big topic of speculation in recent times. They have been spotted running around together several times, but the duo has often denied the reports as false and said they are just friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu