»   » అవార్డు తీసుకోని ఎన్టీఆర్... అవార్డే ఎన్టీఆర్ వద్దకు వచ్చింది (ఫోటోస్)

అవార్డు తీసుకోని ఎన్టీఆర్... అవార్డే ఎన్టీఆర్ వద్దకు వచ్చింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల దుబాయ్‌లో జరిగిన సౌతిండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్(సైమా) 2017 వేడుకలో తెలుగు సినిమాల విభాగంలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమాకు గాను ఎన్టీఆర్ ఈ అవార్డు అందుకున్నారు.

అయితే 'జై లవ కుశ' సినిమా షూటింగులో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ అవార్డు అందుకోవడానికి వెళ్లలేక పోయారు. దీంతో ఆ అవార్డే ఎన్టీఆర్‌ను వెతుక్కుంటూ వచ్చింది. సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ అవార్డును తీసుకుని 'జై లవ కుశ' సెట్స్‌కు వచ్చారు.

అవార్డును అందజేస్తున్న బృందా ప్రసాద్

అవార్డును అందజేస్తున్న బృందా ప్రసాద్

‘జై లవ కుశ' సెట్స్‌లో జూ ఎన్టీఆర్‌కు అవార్డు అందజేస్తున్న సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్. తన కోసం స్వయంగా అవార్డును తీసుకొచ్చిన ఇచ్చినందుకు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు.

ఎన్టీఆర్, రకుల్

ఎన్టీఆర్, రకుల్

సైమా అవార్డుల వేడుకలో తెలుగు సినిమా విభాగం నుండి పెళ్లిచూపులు మూవీ ఉత్తమ చిత్రంగా ఎంపికవగా, ఉత్తమ నటుడుగా, ఎన్టీఆర్(జనతా గ్యారేజ్), ఉత్తమ నటిగా రకుల్ ప్రీత్ సింగ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ బిజీ బిజీ

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘జై లవ కుశ' సినిమా షూటింగులో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో ఆయన 3 విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల జై పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. 24 గంటల్లోనే ఈ టీజర్ 7.8 వ్యూస్ సొంతం చేసుకుంది.

బిగ్ బాస్

మరో వైపు ఎన్టీఆర్ త్వరలో బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ షోపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు టెలివిజన్ రంగంలో ఇదో సంచలనం అవుతుందని భావిస్తున్నారు.

English summary
SIIMA Chairperson Brinda Prasad handing over SIIMA 2017 BEST ACTOR TELUGU (Male) to Jr NTR for Janata Garage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu