For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సైమా 2017:హోరెత్తుతున్న అబుదాబీ, అల్లు శిరీశ్ డీజే అవతారం, విజేతలు (ఫొటోలు)

  |

  ప్ర‌తిష్ఠాత్మ‌క సైమా అవార్డ్స్ సీజ‌న్ 6 సెల‌బ్రేష‌న్స్‌ రెండు రోజుల పాటు (ఈరోజు జూ 30, రేపు జులై 1) ఘ‌నంగా జ‌ర‌గ‌ుతున్నాయి. ద‌క్షిణాది అన్ని భాష‌ల సినిమాల‌కు అవార్డులు ఇచ్చే అరుదైన వేదిక ఇది. ఈసారి సింగ‌పూర్ లోని అబూద‌బీ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌లో ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌ల్లో సౌత్‌లోని అన్ని భాష‌ల‌కు చెందిన దాదాపు 600 మంది సెల‌బ్రిటీలు పాల్గొన‌బోతున్నార‌ని తెలుస్తోంది.

  Photos : SIIMA Awards 2017 In Abu Dhabi

  అల్లు శిరీష్ డీజే గెటప్

  అల్లు శిరీష్ డీజే గెటప్

  సినిమాల్లోనే కాకుండా.. అవార్డ్ ఫంక్షన్స్ లో హోస్ట్ గా కూడా మెప్పించేయగల ప్రతిభ అల్లు శిరీష్ సొంతం. ఈ ఏడాది కూడా సైమా అవార్డుల వేడుకను.. అల్లు శిరీష్- మంచు లక్ష్మి కలిసి నిర్వహించారు. ఇద్దరూ తమ వాక్చాతుర్యంతో ఆహుతులను భలే మెప్పించేశారు. అయితే.. అల్లు శిరీష్ ఎంట్రీతోనే అదరగొట్టేశాడు.

  దువ్వాడ జగన్నాధ శాస్త్రి

  దువ్వాడ జగన్నాధ శాస్త్రి

  తన అన్నయ్య రీసెంట్ మూవీ డీజే గెటప్ లో.. స్టేజ్ పైకి వచ్చిన ఈ కుర్రాడు.. దువ్వాడ జగన్నాధ శాస్త్రిగా భలే అలరించాడు. మంచు లక్ష్మితో కలిసి తెగ నవ్వులు పూయించేశాడు. అటు అన్నయ్య వెండితెరపై దువ్వాడ జగన్నాధంగా నవ్వులు పూయించి వసూళ్ల వర్షం కురిపిస్తుంటే.. ఇటు తమ్ముడు అల్లు శిరీష్ అవార్డు వేడుకలో డీజేగా వచ్చేసి నవ్వుల వాన కురిపించేశాడు.

  అఖిల్ అక్కినేని

  అఖిల్ అక్కినేని

  సైమా 2017 అవార్డ్స్ వేదికగా ఈ అక్కినేని వారసుడి నుంచి బయటకు వచ్చిన కొత్త టాలెంట్ అందరిని ఆశ్చర్య పరిచింది. గత సైమా వేడుకలలో అఖిల్ డాన్స్ అదరగొట్టాడు. కాగా గత రాత్రి అబుదాబిలో జరిగిన సైమా వేడుకలలో అఖిల్ పాల్గొన్నాడు. స్టేజి పై ఓ పాట పాడి అందరిని ఆశ్చర్య పరిచాడు.

  రకుల్ ప్రీత్ సింగ్

  రకుల్ ప్రీత్ సింగ్

  అబుదాబిలో జరుగుతున్న ఈ ఏడాది సైమా అవార్డుల వేడుకలో.. రకుల్ ప్రీత్ సింగ్ కు ఉత్తమనటి అవార్డు దక్కడం విశేషం. ఎన్టీఆర్ తో కలిసి నాన్నకు ప్రేమతో చిత్రంలో ప్రదర్శించిన నటనా ప్రతిభకు గాను రకుల్ కు ఈ పురస్కారం లభించింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకోవడంతో.. అమ్మడి కళ్లలో మెరుపులు మామూలుగా లేవు.

  ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్

  ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్

  ఇకపోతే నాన్నకు ప్రేమతో చిత్రంలో హీరోగా నటించిన ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడం విశేషం. కాకపోతే.. జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఈ అవార్డ్ లభించింది. ఇక బెస్ట్ ఫిలింగా పెళ్లిచూపులు మూవీ నిలవగా.. ఈ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ కు.. బెస్ట్ డైరెక్టర్(డెబ్యూ) అవార్డ్ దక్కింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డును ఊపిరి చిత్రానికి గాను వంశీ పైడిపల్లి దక్కించుకున్నాడు.

  విన్నర్ల లిస్టు చూస్తే ఇలా ఉంది..

  విన్నర్ల లిస్టు చూస్తే ఇలా ఉంది..

  ఉత్తమ చిత్రం.. పెళ్ళి చూపులు: విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌, వినూతన గీత బ్యానర్స్ పై రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పే పని లేదు.

  ఉత్తమ నటుడు (క్రిటిక్స్).. నాని

  ఉత్తమ నటుడు (క్రిటిక్స్).. నాని

  ఉత్తమ నటుడు.. ఎన్టీఆర్ (జనతా గారేజ్), ఉత్తమ నటి.. రకుల్ ప్రీత్ సింగ్ (నాన్నకు ప్రేమతో), ఉత్తమ నటుడు (క్రిటిక్స్).. నాని, ఉత్తమ దర్శకుడు.. వంశీ పైడిపల్లి (ఊపిరి), ఉత్తమ దర్శకుడు (డెబ్యూ).. తరుణ్ భాస్కర్ (పెళ్ళి చూపులు)

  నివేతా థామస్ (జెంటిల్మాన్)

  నివేతా థామస్ (జెంటిల్మాన్)

  ఉత్తమ నటుడు (డెబ్యూ)... రోషన్ (నిర్మల కాన్వెంట్), ఉత్తమ నటి (డెబ్యూ)... నివేతా థామస్ (జెంటిల్మాన్), ఉత్తమ సహాయ నటుడు.. శ్రీకాంత్ (సరైనోడు), ఉత్తమ సహాయ నటి.. అనసూయ భరద్వాజ్ (క్షణం), ఉత్తమ హాస్యనటుడు.. ప్రియదర్శి (పెళ్ళి చూపులు)

  జగపతి బాబు

  జగపతి బాబు

  ఉత్తమ నటుడు (నెగెటివ్ రోల్).. జగపతి బాబు, ఉత్తమ సంగీత దర్శకుడు.. దేవి శ్రీ ప్రసాద్ (జనతా గారేజ్), ఉత్తమ పాటల రచయిత.. రామజోగయ్య శాస్త్రి (ప్రణామం.. జనతా గారేజ్), ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్).. సాగర్ (శైలజా శైలజా.. నేను శైలజ)

  మోహన్ బాబు, మురళి మోహన్

  మోహన్ బాబు, మురళి మోహన్

  ఉత్తమ నేపధ్య గాయిని.. రమ్య బెహరా (రంగ్ దే.. ఆ.ఆ), లైఫ్ టైమ్ అచీవ్మెంట్.. మురళి మోహన్, 40 సంవత్సరాలు పూర్తిచేసిన పురస్కారం.. మోహన్ బాబు ఇలా ఈ సంవత్సరం అవార్డుల వేదిక పై తారల మెరుపులు మెరవనున్నాయి.

  English summary
  SIIMA Awards 2017 Day 1: With sizzling performances from Armaan Malik, Akhil Akkineni and Regina Cassandra, the award show was a hit on the first day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X