»   »  రూమర్ కాదు, శింబుతో నయనతార రహస్య వివాహం!

రూమర్ కాదు, శింబుతో నయనతార రహస్య వివాహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార, శింబు మధ్య గతంలో ఘాటైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరు పెళ్లి చేసుకుంటారా? లేదా? ఒక వేళ చేసుకుంటే ఎలా చేసుకుంటారు? రహస్యంగా ప్రేమ వివాహమా? పెద్దలను ఒప్పించి చేసుకుంటారా? అంటూ చాలా గాసిప్ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత శింబు, నయనతార విడిపోవడం తెలిసిందే. శింబుతో విడిపోయిన తర్వాత నయనతార, ప్రభుదేవా మధ్య కొంత కాలం ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా విడిపోయింది ఈ కేరళ బ్యూటీ. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్న నయనతారన సినిమాలపై దృష్టి సారించింది.

 Simbu to romance with Nayanthara again

చాలా కాలం తర్వాత తన మాజీ ప్రియుడు శింబుతో కలిసి ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి పాండి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో వీరు ప్రేమికులుగా కనిపించనున్నారు. ఇందులో వీరు పెద్దలను ఎదురించి రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఇదంతా సినిమా కథలో భాగమే. అంతే కాదండోయ్...ఇద్దరి మధ్య ఘాటైన శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయట.

ఏది ఏమైనా ఈ మాజీ ప్రేమికులు ఒకప్పుడు రియల్ లైఫ్‌లో చేసిన పనులు, చేయాలనుకున్న పనులు....ఇపుడు రీల్ లైఫ్‌లో చేస్తుండటం చర్చనీయాంశం అయింది. వీరు నటించే ఈ తమిళ చిత్రానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

English summary
Actress Nayanthara Ex Boy friend Young Superstar Simbu, trying to make her as female lead in the upcoming movie. Simbu Nayanthara Pair will make more expectation among the audiences to make the movie on box office hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu