For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కుక్క కాదు.... నక్క: విశాల్ పై శింబు సంచలన కామెంట్స్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ఆ మధ్య తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఇపుడు తమిళ సినీ నటుల అసోసియేషన్ ‘నడిగర్ సంఘం' ఎన్నికలు కూడా అదే స్థాయిలో రసవత్తరంగా మారాయి.

  విమర్శలు, ప్రతి విమర్శలు పోయి..... ఒరినొకరు తీవ్రంగా దూషించుకునే స్థాయికి వెళ్లింది పరిస్థితి. కుక్క, నక్క లాంటి పదాలు వాడుతూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుండటం చూసి సినీ జనాలు విస్తుపోన్నారు.

  ఈ ఎన్నికల్లో అద్యక్ష పదవికి పోటీ చేస్తున్న శరత్ కుమార్, విశాల్ తమ తమ మద్దతుదారులతో రెండు వర్గాలుగా చీలిపోయారు. గత కొంత కాలంగా ఈ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం తాజాగా తారా స్థాయికి చేరింది.

  Simbu thrashes Vishal on Nadigar Sangam issue

  విశాల్ వర్గానికి మద్దతు ఇస్తుండటంతో కమల్ హాసన్ పై ఇటీవల శరత్ కుమార్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చేసిన మేలును మరచిన కృతఘ్నుడని శరత్ కుమార్ కమల్ హాసన్ ను దుయ్యబట్టారు. ఆయన నటించిన 'విశ్వరూపం' విడుదల సమయంలో సమస్యలు వస్తే, తాను దగ్గరుండి సాయం చేశానని గుర్తు చేసిన ఆయన, 'ఉత్తమ విలన్' విడుదల సమయంలో తన భార్య రాధిక ఆయనకు ఎంతో అండగా నిలిచిందని తెలిపారు. తనకు తమిళనాట 'నడిగర సంఘం' నుంచి ఎలాంటి సాయమూ అందలేదని కమల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమతో పోటీలో ఉన్న జట్టుకు మద్దతిచ్చేలా కమల్ మాట్లాడారని, ఇది కృతజ్ఞతా హీనమని అన్నారు.

  తాజాగా శరత్ కుమార్ వర్గం తరఫున ఎన్నికల్లో నిలిచిన యువ కథానాయకుడు శింబు విశాల్ మీద తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించాడు. తమిళ నటుల్లో చీలికలు తెచ్చేందుకు విశాల్ ప్రయత్నాలు చేస్తున్నాడని దుయ్యబట్టాడు. నిన్నకాక మొన్న వచ్చిన బచ్చా విశాల్ అని.. శరత్ కుమార్ లాంటి సీనియర్ని విమర్శించడానికి అతడికి అర్హత లేదన్నాడు. నడిగర్ సంఘం విషయంలో ఇబ్బందులేమైనా ఉంటే చర్చించుకోవాలని.. అలా కాకుండా వీధిలో పడి గొడవ చేయడం విశాల్ నీచమైన బుద్ధికి నిదర్శనమని శింబు వ్యాఖ్యానించాడు.

  తమ వర్గానికి చెందిన సీనియర్ నటుడు రాధా రవి విశాల్‌ను ''కుక్క'' అనడం తప్పేనని.. అయితే విశాల్ నిజానికి ''నక్క''లాగా విశాల్ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని శింబు ధ్వజమెత్తాడు. కాగా, ఇటీవల ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో విశాల్ జట్టు 64 శాతం ఓట్లతో విజయం సాధించవచ్చని వెల్లడి కావడం గమనార్హం. ఈ నెల 18న ఎన్నికలు జరుగనున్నాయి.

  English summary
  With barely 10 days left to decide the winner of the bitterest battle for Kollywood’s Nadigar Sangam crown, efforts by four film bodies to bring peace between warring groups led by actors Vishal and Sarath Kumar seemed to be heading nowhere on Wednesday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X