బాలయ్య 'సింహా' గొడ్డలి మంచి రేటే పలికింది

By Srikanya

బాలకృష్ణ "సింహా" చిత్రం సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అలాగే ఆ చిత్రం సెకెండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే డా నరసింహా పాత్ర ఉపయోగించిన గొడ్డలికి నటీనటుల సంఘం ఇటీవల వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో ఐదు లక్షల రూపాయలకు గొడ్డలిని న్యూజెర్సీకి చెందిన వెంకట్ గరికపాటి, జితేంద్ర అట్లూరిలు సొంతం చేసుకున్నారు. మంగళవారం ఆ గొడ్డలిని బాలకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...సినిమాల్లో హీరోలు ఉపయోగించిన వస్తువులను వేలానికి పెట్టి, తద్వారా సమకూరిన మొత్తాన్ని పేద కళాకారులకు ఉపయోగించడం చాలా ఆనందంగా వుంది.

అలాగే హాలీవుడ్ ‌లో ఎక్కువగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఆ సంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగించడం సంతోషంగా వుంది. డా. నరసింహా పాత్రకు తగ్గట్టుగా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఈ గొడ్డలిని డిజైన్ చేయించాడు. "సింహా" లాంటి చిత్రం చేయడం భగవంతుడు నాకు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాను. ఈ వేలానికి అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అభిమానులు కూడా పేద కళాకారులను ఆదుకోవడం అభినందనీయం అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X