»   » సూర్య ఫ్యాన్స్ గమనించాల్సిన న్యూస్ : ‘సింగం 3’ కొత్త రిలీజ్ డేట్...అఫీషియల్ ప్రకటన

సూర్య ఫ్యాన్స్ గమనించాల్సిన న్యూస్ : ‘సింగం 3’ కొత్త రిలీజ్ డేట్...అఫీషియల్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య అభిమానులంతా ఎదురుచూస్తున్న మూడో సీక్వెల్‌ చిత్రం 'ఎస్‌ 3'కి రిలీజ్ డేట్ కష్టాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసి ఉన్నా పలు కారణాల వలన వాయిదా పడుతూవస్తోంది. జనవరి 26 న విడుదల కావలసిన ఈ చిత్రం తమిళనాడులో జల్లికట్టు నిరసనల కారణంగా వాయిదా పడింది. కాగా చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు.


ఈ సినిమా విడుదల దీపావళి నుంచి వాయిదా పడుతూనే ఉంది. గతేడాది డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే తమిళనాడులో తుఫాన్ ఎఫెక్టుతో సినిమా విడుదల నిలిపేసారు. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం కూడా సినిమా విడుదలను మరోసారి వాయిదా పడేలా చేసింది. పరిస్థితి సద్దుమనిగింది అనుకుంటున్న వేళ 'జల్లికట్టు' ఉద్యమం రూపంలో సినిమాకు ఆటంకం ఏర్పడటం అభిమానులను నిరుత్సాహపరిచింది.


దీంతో ఈ సినిమాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల కారణంగా మళ్లీ వాయిదా పడింది. జల్లికట్టు ఉద్యమం విరమించుకున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


Singam 3 gets new release date


సింగం సిరీస్ లోని మొదటి రెండు భాగాలు ఘనవిజయం సాధించాయి. దీనితో సింగం 3 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ లు హీరోయిన్ లుగా నటించారు.హరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది.సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.


ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈనెల 26 న విడుద‌ల కావ‌ల‌సిన "S3-య‌ముడు-3 చిత్రం విడుద‌ల వాయిదా వేశాము. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంగా విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు నేప‌ధ్యంలో త‌మిళ‌నాట కొన‌సాగుతున్న ప‌రిస్థితుల్ని గ‌మ‌నించి, ఇది విడుద‌ల‌కి స‌రియైన స‌మ‌యం కాద‌ని త‌ల‌చి ఈ నిర్ణ‌యం తీసుకొవ‌టం జ‌రిగింది అన్నారు.


డైర‌క్ట‌ర్ హ‌రి గారు , సూర్య గారి కాంబినేష‌న్ లో వ‌చ్చే చిత్రం కొసం తమిళ‌, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అంద‌రికి తెలుసు.. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రం విడుద‌లని ఏప్ప‌టిక‌ప్ప‌డు వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. మా త‌దుప‌రి విడుద‌ల తేది ని అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.. అని నిర్మాత తెలిపారు.


English summary
Singam 3 postpone the release once again as Tamil Nadu is currently witnessing massive protests by youths to lift the ban on Jallikattu. 'S3' aka 'Singam 3' will now be released on 9th Feb. The producers have announced the new release date officially.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu