twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగీతం శ్రీనివాసరావు ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ అవుతూ పోస్ట్!

    |

    తెలుగులో సింగీతం శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక హిట్ సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కళ్యాణి శనివారం రాత్రి 9 గంటల 10 నిమిషాలకు చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు.

    ఇక ఆమె అంత్యక్రియలు ఆదివారం నాడు చెన్నైలో జరగనున్నాయి. వీరిద్దరికీ 1960వ సంవత్సరంలో వివాహం జరగగా తమ 42 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు అంటూ ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.. వివాహం జరిగే సమయానికి కళ్యాణి ఉపాధ్యాయురాలిగా పని చేసేవారు. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్ రాయడం లో కళ్యాణి భర్త శ్రీనివాసరావుకు సహకరించేవారు.

    అయితే వీరి పెళ్లయిన మొదటి లో అప్పటి వరకు కమర్షియల్ చిత్రాల హవా నడుస్తున్న సమయంలో పాటలు, మాటలు లేకుండా పుష్పక విమానం అనే సినిమాని సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్నప్పుడు అందరూ ఇప్పుడు ఇలాంటి సినిమా అవసరమా అని అడిగితే కళ్యాణి మాత్రం ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని శ్రీనివాసరావు వెనక ఉండి నడిపించారు.

    singeetam srinivasa rao wife lakshmi kalyani passes away

    ఇక వీరిద్దరి వివాహ జీవితం గురించి ఆమె శ్రీ కల్యాణీయం అనే ఒక పుస్తకాన్ని రాయిగా అప్పట్లో పుస్తకం మంచి పేరు తెచ్చుకుంది. 1972లో నీతి నిజాయితీ అనే సినిమాతో దర్శకుడిగా మారిన సింగీతం శ్రీనివాసరావు ఆ తర్వాత పార్వతి, జమీందారు గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, రామచిలుక, అమావాస్య చంద్రుడు, జ్వాలాముఖి, పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, ఘటోద్గజుడు వంటి సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు.

    అలాగే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన వరుడు, చిన్ని చిన్ని ఆశ, వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమాలలో నటుడిగా కనిపించారు. చివరికి ఆయన వెల్కం ఒబామా అనే సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా ప్రేక్షకుల మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం నాగ అశ్విన్ దర్శకుడిగా ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కే సినిమాకు తొలుత కన్సల్టెంట్గా వ్యవహరించారు.

    తర్వాత వయోభారం రీత్యా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సదరు సినిమా ఒక టైం మెషిన్ కి సంబంధించిన సబ్జెక్ట్ అని ముందునుంచే ప్రచారం జరుగుతోంది. గతంలోనే ఆదిత్య369 సినిమాలో టైమిషన్ కాన్సెప్ట్ చేయడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ సింగీతం శ్రీనివాసరావును సంప్రదించినట్లు సమాచారం. అయితే తొలుత ఒప్పుకుని ప్రాజెక్టులో కూడా భాగమైన ఆయన వయోభారం రీత్యా తన వల్ల కాదని భావించి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

    English summary
    singeetam srinivasa rao wife lakshmi kalyani passes away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X