»   » నన్ను చంపొద్దు..., నేను బతికే ఉన్నా..: బాలీవుడ్ టాప్ సింగర్ ఆవేదన

నన్ను చంపొద్దు..., నేను బతికే ఉన్నా..: బాలీవుడ్ టాప్ సింగర్ ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియా వల్ల ఎన్ని ఒలాభాలున్నాయో అన్ని చికాకులూ ఉన్నాయి. ఈ మధ్య ఆకతాయిల చేష్టల వల్ల కొంతా, సమాచారం సరిగా తెలుసుకోకుండానే దాన్ని ఇతరులకు తామే ముందు చెప్పాలన్న ఆతృత కొంత కలిసి సెలబ్రిటీలకి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. సడెంగ ఉనాట్టుండీ ఫలానా నటుడు చనిపోయాడూ అంటూ ఒక్ పోస్ట్ కనిపిస్తుంది అంతే అదిని నిజమా కాదా అన్న నిర్థారణ లేకుండానే అది నిమిషాల్లో ప్రపంచం మొత్తం పాకిపోతుంది.

ఇలా ఈ అబద్దపు మరణానికి గురైన వాళ్లలో తెలుగులో కమేడియన్ వేణూ మాధవ్ ,తమిళ్ లో సెంథిల్ కుమార్ లతో బాటు చాలామంది ప్రముఖులే ఉన్నారు... ఆఖరికి ఈ లిస్ట్ లో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు. ఒకరూ ఇద్దరూ కాదు ఇలా సోషల్ మీడియా హత్యలకు బలై వేదన పడ్డ సెలబ్రిటీలు చాలామందే.

Singer indeep bakshi fires on social media over his death hoax

లేటెస్ట్ గా బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ 'కాలా చష్మా', 'సాటర్‌ డే.. సాటర్‌ డే' వంటి పాటలతో ప్రాచుర్యం పొందిన గాయకుడు ఇన్‌దీప్‌ భక్షి చనిపోయినట్టు గురువారం వదంతులు వ్యాపించాయి. ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించినట్టు సోషల్‌ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి. ఆయన మృతికి సంతాప సందేశాలు కూడా పెట్టేశారు నెటిజన్లు.

రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు ప్రసారమైన వార్తలపై ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు ఇన్‌దీప్‌ భక్షి స్పందించారు. తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, అవన్నీ పుకార్లే అని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదంలో భక్షి మరణించినట్లు సోషల్‌ మీడియాలో గురువారం విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ విషయం తన మిత్రుల ద్వారా తెలుసుకున్న భక్షి దీనిపై నేను బతికే ఉన్నా అంటూ వివరణ ఇచ్చారు.

అదన్న మాట సంగతి. అసలు ఎవరు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారో గానీ. పాపం మరీ అలా చనిపోయారు అంటూ వీళ్ల నైపుణ్యం అంతా ఉపయోగించి ఫొటోలకు దండలూ, దీపాలు పెట్టి పోస్ట్ చేసినప్పుడు సదరు బాదిత కుటుంబ సబ్యులూ, అభిమానులు ఎంతటి మానసిక వేదనకు గురి అవుతారో అని ఒక్కసారి ఆలోచించించరా...

English summary
Singer Indeep Bakshi has denied reports that he died in a car accident, saying he is "absolutely fine and healthy".The news of his death got viral after a clip of a car crash resurfaced on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu