For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సింగర్ సునీతకు చేదు అనుభవం: ఘోరంగా ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. అతడి బాగోతం బట్టబయలు

  |

  కోయిల వంటి గొంతుతో కొన్ని వేల పాటలను ఆలపించి.. దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సింగర్‌గా వెలుగొందుతున్నారు సునీత. టీనేజ్‌లోనే గాత్ర ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో గుర్తింపును అందుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లు సంపాదించుకుంటూ పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తన హవాను చూపిస్తూనే ఉన్నారు. ఇక, ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సునీత.. తాజాగా జరిగిన లైవ్ చాట్‌లో ఓ దర్శకుడి బాగోతం బయట పెట్టారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  సునీత ప్రస్థానం.. ఎన్నో మైలురాళ్లు సొంతం

  సునీత ప్రస్థానం.. ఎన్నో మైలురాళ్లు సొంతం

  మ్యూజిక్ మీద ఉన్న మక్కువతో చాలా చిన్న వయసులోనే శిక్షణ తీసుకున్నారు సునీత. ఈ క్రమంలోనే తన 15వ ఏటలో ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మరపురాని గీతాలను ఆలపించి ఔరా అనిపించారు. తద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అంతేకాదు, ఎన్నో అవార్డులు, పురస్కారాలను తన ఖాతాలో వేసుకున్నారు సునీత.

  ఆ వయసులోనే పెళ్లి.. భర్తతో విడిపోయింది

  ఆ వయసులోనే పెళ్లి.. భర్తతో విడిపోయింది

  టీనేజ్‌లో ఉన్నప్పుడే సింగర్ సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. చాలా కాలం పాటు సవ్యంగానే సాగిన వీళ్ల కాపురం.. ఆ తర్వాత మనస్ఫర్థల కారణంతో న్యాయ పరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సినిమాల్లో పాటలు పాడుతూ.. డబ్బింగ్ చెబుతూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తూ వచ్చారు.

  సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. పెళ్లి మాత్రం అలాగ

  సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. పెళ్లి మాత్రం అలాగ

  సునీత రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూ ఉండేవి. కానీ వాటిని ఆమె పలుమార్లు కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం సంబరంగా వివాహం చేసుకున్నారు సింగర్ సునీత.

  పెళ్లి తర్వాత ఫుల్ ఎంజాయ్.. హాలీడే ట్రిప్స్

  పెళ్లి తర్వాత ఫుల్ ఎంజాయ్.. హాలీడే ట్రిప్స్

  రామ్‌తో వివాహం జరిగిన తర్వాత సునీత చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. తరచూ ఏదో ఒక ప్రదేశానికి వెళుతూ ఆనందంగా గడుపుతున్నారు. అంతేకాదు, ఆ మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలోనూ వదులుతున్నారు. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్‌తో ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు.

  దర్శకుడిపై సునీత సంచలన ఆరోపణలు

  దర్శకుడిపై సునీత సంచలన ఆరోపణలు

  సోషల్ మీడియాలో సునీత ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకుడిపై సింగర్ సునీత సంచలన ఆరోపణలు చేశారు.

  డబ్బింగ్ థియేటర్‌లో ఇబ్బంది పెట్టాడంటూ

  డబ్బింగ్ థియేటర్‌లో ఇబ్బంది పెట్టాడంటూ

  తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి వెల్లడిస్తూ.. ‘డబ్బింగ్‌ థియేటర్‌లోకి వెళ్లగానే డైరెక్టర్‌ హాలో మేడమ్‌.. మీ అభిమానిని అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఆయన నన్ను సునీత అని పిలవడం స్టార్ట్‌ చేశారు. అలా కొన్ని సెషన్ల తర్వాత మధ్యలో అరేయ్‌.. కన్నా.. బుజ్జి అనేవారు. ఆ మాటలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి' అని చెప్పారు సునీత.

  అదే నా అదృష్టం.. గుర్తొస్తే అలా అనిపిస్తుంది

  అదే నా అదృష్టం.. గుర్తొస్తే అలా అనిపిస్తుంది

  దీనిని కొనసాగిస్తూ.. ‘డబ్బింగ్ సమయంలో ఆ దర్శకుడు ప్రవర్తించిన తీరు నాకు చిరాకు తెప్పించింది. అందుకే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇది నా జీవితంలోనే అత్యంత చేదు పరిణామం. నా అదృష్టం కొద్దీ ఆయనను మరోసారి కలుసుకునే పరిస్థితులు రాలేదు. ఇంకో విషయం ఏమిటంటే ఇది గుర్తొచ్చినప్పుడల్లా నాకు బాగా నవ్వు వస్తుంటుంది' అంటూ సింగర్ సునీత వివరించారు.

  English summary
  Sunitha Upadrasta is a playback singer, anchor, host, dubbing artist & actress in the Telugu film industry, also known as Tollywood. She has received a National Award from All India Radio under light music category, two Film fare Awards for Best Female Playback Singer one each for Telugu and Kannada.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X