»   » 'ముక్కాల..ముక్కాబుల' గాయని స్వర్ణలత మృతి

'ముక్కాల..ముక్కాబుల' గాయని స్వర్ణలత మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కుచ్చి కుచ్చి కూనమ్మ(బొంబాయి),మాయా మశ్చీంద్ర(భారతీయుడు), ముక్కాల ముక్కాబుల(ప్రేమికుడు) వంటి ఎన్నో పాటలకు ప్రాణం పోసిన సుప్రసిద్ధ దక్షిణాది నేపథ్య గాయని, జాతీయ అవార్డు విజేత స్వర్ణలత (37) ఇక లేరు. ఆమె గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ చెన్నై లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్(మలార్ హాస్పిటల్) లో ఆదివారం ఉదయం కన్నుమూశారు. కేరళ పాలక్కాడ్‌ జిల్లాలో జన్మించిన స్వర్ణలత 1989 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ, హిందీతో సహా వివిధ భాషలలో మొత్తం 7500పాటలు పాడారు. 1983లో బెస్ట్ ఫిమేల్ సౌత్ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ గా అవార్డు పొందారు. తమిళ చిత్రం 'కరుత్తమ్మా" లో ఎఆర్‌. రెహ్మాన్‌ స్వరపరిచిన 'పోరాళె పొన్నుతాయి" గీతానికి ఉత్తమ నేపథ్య గాయనిగా స్వర్ణలతకు 1995లో జాతీయ అవార్డు లభించింది. ఇక స్వర్ణలత ఎక్కువగా ఇళయరాజా, ఎఆర్.రహ్మాన్ సంగీత దర్శకత్వంలో పాడారు. అలాగే ఆమె డబ్బింగ్‌ కళాకారిణి కూడా. స్వర్ణలత మృతికి నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు ఎం.జి. శ్రీకుమార్‌ దిగ్భ్రాంతి ప్రకటిస్తూ, ఆమె మరణం భారతీయ సినీ సంగీతానిక లోటు అని పేర్కొన్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu