»   »  సినారే షరతులు.. ఎన్టీఆర్ ఒప్పుకోక తప్పలేదట.. సీతయ్య ఎవరీ మాట వినడు..

సినారే షరతులు.. ఎన్టీఆర్ ఒప్పుకోక తప్పలేదట.. సీతయ్య ఎవరీ మాట వినడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినారేగా సుపరిచితులైన తెలుగు సాహిత్య శిఖరం నేలకొరిగింది. తెలుగు సాహిత్యం, సినీ సాహిత్యానికి విశేష సేవలందించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సినారే మరణంతో తెలుగు సాహిత్య లోకం, సినీ పరిశ్రమ మూగపోయింది. కవి, రచయితగా, సినీ గేయరచయితగా ఎవరూ అధిరోహించని శిఖరాలను తన ప్రతిభా పాటవాలతో చేరుకొన్నారు. కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట లాంటి మారుమూల ప్రాంతంలో జన్మించిన సినారే భారతీయ సాహిత్యరంగంలో మేటి దిగ్గజమనే ఘనతను సొంతం చేసుకొన్నారు. ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం.

సినారే షరతులు

సినారే షరతులు

1962లో తెలుగు సినీ పరిశ్రమలోకి తొలిసారి ప్రవేశించారు. కవిగా మంచి గుర్తింపును అప్పటికే సొంతం చేసుకొన్న సినారేకి ఎన్నో అవకాశాలు తలుపుతట్టాయి. అయినా చాలా ఆఫర్లను తిరస్కరించారు. గులేబకావలి సినిమా కోసం పాటలు రాయాలని సినారేను కోరగా.. నందమూరి తారక రామారావుకు కొన్ని షరతులు విధించారు. సింగిల్ కార్డు టైటిల్ ఇస్తేనే పాటలు రాస్తానని స్పష్టం చేయగా అందుకు ఎన్టీఆర్ సమ్మతించారు. దాంతో గులేబకావళి కథ చిత్రానికి పాటలు రాశారు. ఆ చిత్రానికి ఆయన రాసిన నన్ను దోచుకుందువటే పాటతో మరికొన్ని పాటలు ఆణిముత్యాలుగా నిలిచాయి. ఎన్టీఆర్ నటనకు సినారే సాహిత్యం అదనపు ఆకర్షణగా మారింది. ఆ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలువడంతో సినీ సాహిత్యరంగంలో సినారేకు ఎదురేలేకుండా పోయింది.

ఉర్దూ, తెలుగు భాషలపై పట్టు

ఉర్దూ, తెలుగు భాషలపై పట్టు

హిందీ పాటలను తెలుగులోకి అనువదించడంలో సినారేకి మరెవరూ సాటిరారనే విషయం అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి చిత్రంలో స్నేహమేరా జీవితం అనే పాట హిందీలో ఘనవిజయం సాధించిన జంజీర్ చిత్రంలోనిది. యారీ హై ఇమాన్ మేరా గజల్‌ను తెలుగులోకి స్నేహమేరా జీవితం పాటగా అనువదించిన తీరు ఉర్దూ, తెలుగు భాషలపై ఆయనకు పట్టును తెలియజెప్పింది.

ఆణిముత్యాలు ఇవే..

ఆణిముత్యాలు ఇవే..

బందిపోటులో వగలరాణివి నీవే సొగసుకాడను నేనే, రాముడు భీముడు నెలరాజ నీరూపు తెలిసిందిలే, ధర్మదాతలో ఓ నాన్నా నీ మనసే వెన్న, చెలెల్లికాపురంలో చరణ కింకరణులు ఘల్లుఘల్లుమనగా, అల్లూరి సీతారామరాజు వస్తాడు నా రోజు ఈ రోజు, మంగమ్మగారి మనవడు చందరుడు నిన్ను చూసి, స్వాతి ముత్యంలో లాలీ లాలీ, సూత్రధారులు చిత్రంలో జోలా జోలమ్మ, ఒసేయ్ రాములమ్మలో ఓ ముత్యాల కొమ్మ, మురిపాల రెమ్మ, అరంధతిలో జేజమ్మా జేజమ్మా అనే పాటలు ఆయన ప్రతిభకు కొన్ని మచ్చుతునకలు. హైదరాబాద్ నగర విశిష్ఠతను తెలుపుతూ రిమ్ రిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్ పాట అద్భుతమైన గీతంగా నిలిచింది.

సీతయ్యకు నంది అవార్డు

సీతయ్యకు నంది అవార్డు

దర్శకుడు వైవీఎస్ చౌదరీ, నందమూరి హరికృష్ణ కాంబినేషన్ చిత్రం సీతయ్యలో సినారే రాసిన పాటకు నంది అవార్డు లభించింది. ‘ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ' పాటకు ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. దేశభక్తి పాటలు రాయడంలో ఆయన మించిన వారు ఎవరూ ఉండరేమో అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు జాతి మనది అంటూ రాసిన పాట ఇప్పటికీ తెలుగు వాళ్లందరికీ స్ఫూర్తిగా నిలిచింది. టీ కృష్ణ దర్శకత్వం వహించిన రేపటి పౌరుల చిత్రంలోని రేపటి పౌరులం అనే పాట పిల్లల్లోనే కాకుండా, యువతకు స్ఫూర్తి నింపింది.

సంగీత దర్శకులకు కొరకరాని కొయ్యగా..

సంగీత దర్శకులకు కొరకరాని కొయ్యగా..

చెల్లెలి కాపురం చిత్రంలో చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన పాటకు ముందు వచ్చే సాకీకి ట్యూన్ కట్టడానికి సంగీత దర్శకుడికి కొంత ఇబ్బంది ఎదురైందట. కవితలను పాడటంలో సినారేది ప్రత్యేకమైన శైలి ఉండేది. ఆయన పాడే స్టయిల్‌ను అనుకరిస్తూ సినారే పాడినట్టే బాలు చేత పాడించారని చెప్పుకొంటారు. దానవీరశూర కర్ణ చిత్రంలో చిత్రం భళారే విచిత్రం అనే పాట చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో సినారే రాశారని చెప్పుకొంటారు. ప్రతినాయక పాత్ర ఛాయలు ఉన్న ధుర్యోధనుడికి ఓ రొమాంటిక్ పాట రాయడం సాహితీకారులకు సవాల్‌గా మారిందని, దాంతో ఎన్టీఆర్ సినారేకి సందర్భం చెప్పగా చిత్ర భళారే విచిత్రం అనే పాట పురుడు పోసుకొన్నది. ఆ పాట దాన వీర శూర కర్ణ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సినీ ప్రముఖులతో అనుబంధం

సినీ ప్రముఖులతో అనుబంధం

నిజాం కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడే ఓ స్నేహితుడి ద్వారా ఎన్‌టి రామారావు‌కు పరిచయమయ్యారు. అప్పుడే ఎన్‌టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు రూపొందిస్తున్న 'గులేబకావళి కథ' సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం కల్పించారు. ఈ సినిమా విడుదల తర్వాత సినారే, ఎన్టీఆర్ మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఎన్‌టి రామారావు నటించిన అనేక సినిమాలకు ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను రాశారు. ప్రముఖహీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణలాంటి వారికి ఎన్నో మంచి గీతాలు రచించారు.

English summary
Legendary writer S Narayanareddy (CNare) is no more. He writes many memorable songs for Telugu. He is familiar for translating Ghazal from Urdu to Telugu. He got Nandi award for Seethayya movie recent times.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu