»   »  నిర్మాతగా మారిన నటుడు శివ బాలాజీ, మూవీ డిటేల్స్

నిర్మాతగా మారిన నటుడు శివ బాలాజీ, మూవీ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఇది అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ' సినిమాతో తెరంగేట్రం చేసి ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, చంద‌మామ‌, శంభో శివ శంభో వంటి చిత్రాల్లో నటించి తెలుగు, తమిళంలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ. విలక్షణమైన పాత్రల్లో నటించిన శివబాలాజీ ఇప్పుడు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని నిర్మాతగా మారారు.

గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ‘పడ్డానండీ ప్రేమలో మరి' వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. రేప‌టి నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

ఈ సంద‌ర్భంగా శివ‌ బాలాజీ మాట్లాడుతూ "యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే త‌లంపుతో నిర్మాత‌గా మారాను. మా అబ్బాయి పేరుపై గ‌గ‌న్ మ్యాజిక‌ల్ ఫ్రేమ్స్ అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాను. ఈ బ్యాన‌ర్‌లో తొలి చిత్రం రేప‌టి(సెప్టెంబ‌ర్ 23) నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. ఒక న‌టుడుగా నేను సినిమా ఇండస్ట్రీలోకి 2002, సెప్టెంబ‌ర్ 23న ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు నిర్మాత‌గా నేను చేస్తున్న సినిమా సెప్టెంబ‌ర్ 23న స్టార్ట్ అవుతుండ‌టం ఆనందంగా ఉంది అన్నారు.

Siva Balaji new film details

ఈ సంద‌ర్భంగా న‌న్ను ఆద‌రించిన ప్రేక్షకులు, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టుడు అజ‌య్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. మహేష్ ఉప్పుటూరి ద‌ర్శ‌కుడు.అలాగే భరణి కె.ధరణ్, సునీల్‌ కశ్యప్ వంటి మంచి యంగ్ టీమ్ కుదిరింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తోరూపొందనున్న ఈ చిత్రం 1980 బ్యాక్ డ్రాప్ పై, ఓ నిజ ఘటన ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఇద్ద‌రి స్నేహితుల క‌థ‌. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ తో సినిమా ఉంటుంది అన్నారు.

శివబాలాజీ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ధన్ విన్, కెమెరా: భరణి కె.ధరణ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్; నిర్మాత: శివబాలాజీ మనోహరన్, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.

English summary
Actor Siva Balaji turns producer. Sources tell us that Siva Balaji will be acting as one of the leads in his first production venture. This film will be directed by Mahesh Upputuri and Ajay will enact as the other lead in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu