»   »  తెలుగు తెరకు మరో ఎన్నారై దర్శకుడు

తెలుగు తెరకు మరో ఎన్నారై దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sivaji
శేఖర్ కమ్ముల,క్రిష్,హరి ఏలేటి అనంతరం ఇప్పుడు కళాసాగర్ అనే మరో ఎన్నారై దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. శివాజి,భరత్ (టెన్త్ క్లాస్ ఫేమ్) హీరోలుగా రూపొందే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఫోన్ బూత్ అనే హాలీవుడ్ ఫ్రీమేక్ గా రిషి హీరోగా వచ్చిన గీత సినిమా నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక కళాసాగర్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి యు.ఎస్ లో ఎమ్.ఎస్ పూర్తి చేసి అక్కడే సెటిల్ అయ్యారు. అయితే సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఇండియా వచ్చి రవిబాబు దగ్గర పార్టీ,అనసూయ చిత్రాలకు అసెస్టెంట్ గా పనిచేసారు. ప్రస్తుతం స్నేహ గీతం చిత్రానికి అసోసియేట్ గా చేస్తున్న ఈయన తన మొదటి సినిమాకు యాక్షన్ జెనర్ ఎంచుకున్నట్లు సమాచారం. బెస్టాఫ్ లక్ కళాసాగర్...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X