»   » రాఘవ లారెన్స్ ‘శివ లింగ’ టీజర్

రాఘవ లారెన్స్ ‘శివ లింగ’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాఘవ లారెన్స్ హీరోగా త్వరలో 'శివ లింగ' చిత్రం రాబోతోంది. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజైంది. తమిళంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. జనవరి నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉంది చిత్ర బృందం.

గతంలో రాఘవ లారెన్స్ నటించిన చిత్రాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఈచిత్రాన్ని తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే లారెన్స్ తో పలువురు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

శివలింగలో లారెన్స్ సరసన సాలా ఖడూస్ ఫేమ్ రితికా సింగ్ కథానాయికగా నటించింది. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా శివ లింగ సినిమా రిలీజై భారీ విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

English summary
Check out official teaser of Sivalinga starring Raghava Lawrence & Ritika Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu