»   » మహేష్ కి నేనే విలన్ని నేనే, హీరోయిన్ శృతీ హసన్: తేల్చి చెప్పిన దర్శకుడు

మహేష్ కి నేనే విలన్ని నేనే, హీరోయిన్ శృతీ హసన్: తేల్చి చెప్పిన దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక స్టార్ హీరో సినిమా మొదలౌతోందీ అనగానే ఇక దానితో పాటు వింత వింత వార్తలు కూఅడా హల్ చల్ చేస్తుంటాయి..వీటిలో కొన్ని సినిమా హైప్ కోసం యూనిట్ వాళ్ళు సృష్టించేవి కూడా ఉంటాయి. అందుకే పూర్థి క్లారిటీ వచ్చేదాకా ఏది నిజమో ఏది అబద్దమో తెలుసు కోవటం కష్టమే.

ఇలగే మురుగదాస్-మహేష్ బాబు ల కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా గురించి కూడా చాలానే వచ్చాయి. వీటిలో కొన్నిటిని దర్శకుదు మురుగ దాసే స్వయంగా అవన్నీ పుకార్లు అంటూ కొట్టిపడేసాడు. రాబోయే సినిమాలో దర్శకుడు ఎస్.జె.సూర్యా అనగానే నమ్మాలా వద్దా అనుకున్నారంతా.

ఈ మధ్యే ఈ సినిమాలో తమిళ దర్శకుడు-నటుడు ఎస్.జె.సూర్య మహేష్ కొత్త సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకూ హీరోగా కొనసాగిన ఈ దర్శకుడు విలన్ అనటం తో ఇది నిజమో కాదో అని మహేష్ అభిమానుల్లో డౌట్ ఉంది. అయితే "ఆవిలన్ ని నేనే" అని స్వయంగా ఎస్.జె.సూర్యనే కన్ఫర్మేషన్ ఇచ్చేయడంతో సందేహాలు తొలగిపోయాయి.

SJ Surya as Villain in Mahesh Babu movie

ఇటీవలే "పిజ్జా" ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో "ఇరైవి" అనే సినిమాలో కీలక పాత్రతో చేసి అందరి ప్రశంసలూ పొందిన ఎస్.జె.సూర్య. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ మహేష్ రాబోయే సినిమాలో విలన్ గా చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఐతే ఈ సంగతి అఫీషియల్ గా మురుగదాస్,ఆ సినిమా నిర్మాతలే మరోసారి ఆధికారికంగా చెప్పనివ్వండి అన్నాడు సూర్య. ఇక పవన్ కళ్యాణ్ సినిమా గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో కొన్ని కబుర్లు చెప్పాడు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యాక్షన్ లవ్ స్టోరీతో లో ఇప్పటివరకూ పవన్ టచ్ చేయని రోల్ అనీ ఖుషీ ల నాటుఇ మ్యాజిక్ మరో సారి రిపీట్ అవనుందని చెప్పిన సూర్య ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ అని కూడా కన్ఫమ్ చేశాడు . అంతే కాదు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తానుహీరో గా ఒక సినిమా కూడా చేస్తున్న థ్రిల్లర్ మూవీ పూర్తయిందని.. ఇది తన యాక్టింగ్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని చెప్పాడు.

English summary
SJ Suriya who directed movies Nani, Kushi and Puli in Tollywood will be a part of Mahesh Babu's movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu