»   »  'స్నేహ'మేరా సంతోషం

'స్నేహ'మేరా సంతోషం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sneha
ఉక్కిరిబిక్కిరి చేసే అందం ఉక్కిరిబిక్కిరి అయిన సమయమది. తెలుగు,తమిళ భాషల్లో అటు సంప్రదాయ పాత్రలలోనూ, ఇటు మోడ్రన్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ లోనూ నటించి అందరినీ అలరిస్తున్న అందం స్నేహ. ఆమె తాజాగా బాలకృష్ణ సరసన 'పాండురంగడు'లో పుండరీకుని భార్య లక్ష్మి పాత్రను చక్కగా పోషించింది. ప్రపంచ వాప్తంగా రిలీజైన ఈ సినిమాతో ఆమె అందరి ప్రశంసల్ని పొందుతోంది. కాగా ఇటీవల ఆమె అమెరికాలో అభిమానుల నుంచి అనుకోని తొక్కిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఆమె 'అచ్చుముండు అచ్చుముండు' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె సరసన హీరో ప్రసన్న. దీని షూటింగ్ ఇప్పుడు న్యూజెర్సీలో జరుగుతోంది. అక్కడ షూటింగ్ జరుగుతున్న లోకేషన్‌కు దగ్గరలోనే 'పాండురంగడు' ఆడుతోంది. ప్రేక్షకుల మధ్యలో ఆ సినిమాను చూసేందుకు వెళ్లింది స్నేహ. మధ్య మధ్యలో ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ వుంటే ఆమె ఆనందిస్తూ వుంది. అనుకోకుండా వారికి తమ మధ్య స్నేహ వున్న సంగతి తెలిసిపోయింది. దాంతో ఒక్కసారిగా తోసుకుంటూ వారు ఆమె దగ్గరకి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసేశారు. కొంతమంది ఆమెతో కరచాలనం చేస్తే కొంతమంది ఆమెను స్పృశించాలని ప్రయత్నించారు. ఇంకొంతమంది ఆటోగ్రాఫులు తీసుకున్నారు.

ఒక్కసారిగా వారంతా తనమీదకి వచ్చేసరికి స్నేహకు ఊపిరి సలపనంత పనయ్యింది. ఎలాగో వారిని తప్పించుకుని బయటపడి, కారులో కూర్చునేదాకా ఆమె మామూలు మనిషి కాలేకపోయింది. అంతా పూర్తయ్యాక నిర్వాహకులు ఆమెను జాగ్రత్తగా కారు వద్దకు తీసుకెళ్లి హోటల్‌కు పంపించారట. దాంతో ఇంతటి అభిమానం పొందగలిగినందుకు ఆనందించాలా...లేక తట్టుకోలేనంత తాకిడి ఎదురైనందుకు బాధపడాలో అర్ధం కాని డైలమాలో పడిందిట స్నేహ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X