»   »  'బాహుబలి' లో ఆ సీన్ పెట్టడం పద్దతి కాదంటూ హీరోయిన్

'బాహుబలి' లో ఆ సీన్ పెట్టడం పద్దతి కాదంటూ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సినీ ప్రపంచమంతా 'బాహుబలి' ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తూంటే, హీరోయిన్ స్నేహా ఉల్లాల్ మాత్రం సినిమాలో ఓ తప్పు పట్టుకుంది. తనకేం నచ్చలేదో అది ట్విట్టర్ సాక్షిగా చెప్పేసింది. సినిమాలో ఫలానాది తప్పు అని నిలదీసింది. ఇంతకీ స్నేహ పట్టుకున్న తప్పు ఏంటో మీరే చూడండి.


ఆమె ట్వీ్ట్ లో... బాహుబలి విషయంలో నాకు ఓ విషయం అస్సలు నచ్చలేదు. యుద్దానికి వెళ్లే ముందు దేవతలని ప్రసన్నం చేసుకోవటానికి ఓ మూగ జీవిని బలి తీసుకోవటం చూపించారు. నాకు అసలు నచ్చలేదు. కల్చర్లో అలాంటిది ఉన్నా..దాన్ని తెరపై పబ్లిగ్గా చూపించటం అస్సుల బాగోలేదు. భళ్లారి దేముడు ఆ దున్నపోతుని నరికేయటం అసలు నచ్చలేదు అని చెప్పుకొచ్చింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇది ఇలా ఉంటే... 'బాహుబలి' దర్శకుడు రాజమౌళిని దర్శకుడు శంకర్‌ అభినందనలతో ముంచెత్తారు. 'బాహుబలి' అద్భుతమైన చిత్రమంటూ కితాబిచ్చారు. తన సినిమాలతో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచే శంకర్‌, తనకు నచ్చిన చిత్రాల గురించి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేయడం అలవాటు. ఈ విషయమై ఆయన ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.


''మహాకావ్య ఆలోచన! కవితాత్మకమైన వూహ. అద్భుతమైన పాత్రల చిత్రీకరణ. చక్కని హీరోయిజం. ఆసక్తిగొలిపేలా.... వావ్‌ అనిపించేలా చేస్తోంది. రాజమౌళికి, ఆయన బృందానికి అభినందనలు'' అంటూ కితాబిచ్చారు.


 Sneha Ullal comments on Baahubali movie

దీనిపై రాజమౌళి కూడా స్పందించారు. 'మీ అభినందనలకు కృతజ్ఞతలు. మా బృందానికి మరింత సంతోషం. మీ మాటలు అభినందనలు మాత్రమే కావు.. ఓ సర్టిఫికెట్‌ కూడా!'' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.


ఇక దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనకు అండగా నిలిచిన ట్విట్టర్‌ స్నేహితులకు, సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 10న విడుదలై భారత సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన 'బాహుబలి' చిత్రాన్ని ఉద్దేశించి ఆయన తన ట్విట్టర్‌లో స్పందించారు.


చిత్రం నిర్మాణంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. అందరి నుంచి ఇంతటి ఆదరణ లభిస్తుందనుకోలేదని అన్నారు. చిత్ర బృందం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్‌ చేశారు.


English summary
sneha ullal ‏ tweeted that: " One thing i didn't like in Bahubali is the culture to sacrifice an animal.Even if its just a movie it shouldn't be presented to the public.."
Please Wait while comments are loading...