»   » విపరీతమైన నొప్పి,యేడాది దాకా రెస్ట్...స్నేహా ఉల్లాల్

విపరీతమైన నొప్పి,యేడాది దాకా రెస్ట్...స్నేహా ఉల్లాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు నేను సినిమా చేసే స్థితిలో లేను. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చేశాక నడుముకి అయిన గాయం 'సింహా' తర్వాత తిరగబెట్టింది. విపరీతమైన నొప్పితో బాధపడ్డా. డాక్టర్లు ఓ ఏడాది పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. ఇప్పటికీ నొప్పి వస్తూనే ఉంది. అందువల్ల కొత్తగా ఏ సినిమానీ ఒప్పుకోలేదు. ఒక కన్నడ చిత్రం మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. గాయం పూర్తిగా తగ్గాక అప్పుడు వరుసగా సినిమాలు చేస్తా అంటూ చెప్పుకొచ్చింది స్నేహా ఉల్లాల్. ఆమె కొత్తగా ఏ చిత్రాలు కమిటవ్వటంలేదు. రీసెంట్ గా ఆమె నాని హీరోగా బి.వి. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన 'అలా.. మొదలైంది!' చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేసింది స్నేహ. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu