twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైగర్ బతికే ఉంది, పాపం జింక చచ్చిపోయింది: సల్మాన్ సినిమాపై జోకులు మామూలుగా లేవు

    సల్మాన్ కొత్త సినిమా టైగర్ జిందా హై ట్రైలర్ వచ్చినప్పటినుంచీ "టైగర్‌ బతికుంది కానీ.. పాపం కృష్ణజింకే లేదు" అంటూ సల్మాన్ ఖాన్ పై జోకులు, పంచ్‌ డైలాగులు విసురుతున్నారు.

    |

    Recommended Video

    సల్మాన్ సవాల్.. దిమ్మతిరిగేలా ట్రైలర్

    సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'టైగర్‌ జిందా హై'. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2015లో వచ్చిన 'ఏక్‌ థా టైగర్‌'కి సీక్వెల్‌గా రాబోతోంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా ట్రయిలర్ ఈ మధ్యనే విడుదలైంది. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో కేవలం ట్రైలర్ లోనే చెప్పేసారు.

     సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం

    సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం

    సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కత్రినాకైఫ్. పాకిస్థానీ గూఢచారిగా కత్రినాకైఫ్ ఇందులో కనిపించనుంది. ఇండియన్ ఏజెంట్, పాకిస్థానీ గూఢచారి మధ్య రొమాన్స్ కూడా ఉంది ఈ సినిమాలో. కంప్లీట్ యాక్షన్ ఎడ్వంచరస్ మూవీగా, సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా, డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తోంది టైగర్ జిందా హై.

    17 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు

    17 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు

    ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ 70 ఏళ్ల వృద్ధుడిగా కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లలో సల్మాన్‌ యువకుడిగా కన్పించారు. కానీ సినిమాలో 17 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు వివిధ గెటప్‌లలో కన్పిస్తారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.ఈ చిత్రాన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.

    హాలీవుడ్‌ నుంచి టామ్‌ స్ట్రూథర్స్‌

    హాలీవుడ్‌ నుంచి టామ్‌ స్ట్రూథర్స్‌

    ఈ విషయాన్ని సల్మాన్‌ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే అది ఏ ఘటన అన్న విషయాన్ని మాత్రం సల్మాన్‌ చెప్పలేదు.ఈ చిత్రంలో అదిరిపోయే ఫైటింగ్‌ సన్నివేశాలుఉంటాయని సల్మాన్‌ చెప్పారు. ఇందుకోసం హాలీవుడ్‌ నుంచి టామ్‌ స్ట్రూథర్స్‌ అనే స్టంట్‌ డైరెక్టర్‌ను పిలిపించారు.

    భారీ ఆయుధాలతో

    భారీ ఆయుధాలతో

    సినిమా చూస్తున్నంత సేపు సల్మాన్‌ హాలీవుడ్‌ చిత్రంలో నటించారా? అన్న ఫీలింగ్‌లో ఉండిపోతారని దర్శకుడు అలీ అన్నారు. ఈ పోరాట సన్నివేశాలను అబుదాబి, ఆస్ట్రియాలో తెరకెక్కించారు. గుర్రాలు, భారీ ఆయుధాలతో వీటిని తెరకెక్కించారు.

    మరో సూపర్‌హిట్‌

    మరో సూపర్‌హిట్‌

    "ట్యూబ్‌లైట్‌"తో ఈ ఏడాది భారీ ఫ్లాప్‌ను అందుకున్న సల్మాన్‌ "టైగర్‌ జిందా హై"తో మరో సూపర్‌హిట్‌ను అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.

     టైగర్‌ బతికుంది కానీ..

    టైగర్‌ బతికుంది కానీ..

    ట్రైలర్‌పై ప్రశంసల సంగతి ఎలా ఉన్నా.. కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికర పంచ్‌లు విసురుకుతున్నారు." టైగర్‌ బతికుంది కానీ.. పాపం కృష్ణజింకే లేదు" అంటూ జోకులు, పంచ్‌ డైలాగులు విసిరుతున్నారు.

     టైగర్‌ సే బెహ్‌తర్‌ కోహి నహి కర్తా

    టైగర్‌ సే బెహ్‌తర్‌ కోహి నహి కర్తా

    "షికార్‌ థో సబ్‌ కర్తే హై లేకిన్‌ టైగర్‌ సే బెహ్‌తర్‌ కోహి నహి కర్తా" (అందరూ వేటాడుతారు కానీ , పులి కన్నా మెరుగ్గా ఎవరూ వేటాడలేరు) అంటూ ఈ సినిమాలో సల్మాన్‌ చెప్పిన డైలాగ్‌ను కూడా కృష్ణజింక కేసు విషయంలో ఉదహరిస్తున్నారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ కొన్నాళ్ల కిందటి వరకు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

    English summary
    Hilarious comments in Social Media on Salman Khan Tiger Zinda Hai Movie Trailer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X