»   »  మీలో సినిమా తీసే దమ్ముందా..? మీకోసమే షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్

మీలో సినిమా తీసే దమ్ముందా..? మీకోసమే షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా కొన్ని వందలమంది కల.... కొన్ని వేలమంది ని ఆకర్షించి తనలో కలుపుకునే కళ.. ఈ ప్రయత్నం లో రంగుల కలలతో జీవితాలని త్యాగం చేసుకున్న వాళ్ళూ, ఈ కళకోసం జీవితాలను పణగా పెట్టిన వాళ్ళూ కోకొల్లలు. ఒకప్పుడు ఫొటోలు పట్టుకొనీ, చిన్న స్టేజ్ ప్రోగ్రాముల్లో ఇచ్చిన ప్రదర్శణ తాలూకు వీడియో క్లిప్ లని పట్టుకొని, తమ శక్తినీ, ఊహా స్థాయినీ కథలుగా రాసుకొన్న కాగితాలతో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగీ అవకాశాల కోసం వెంపర్లాడేవాళ్ళు..

 షార్ట్ ఫిలిమ్

షార్ట్ ఫిలిమ్

కానీ కాలం మారింది కళ అనే కలని నెరవేర్చుకోవటానికి అవకాశాల పరిది పెరిగింది.. షార్ట్ ఫిలిమ్ ఇప్పుడు సినిమా రంగం లో విప్లవాత్మక మలుపు తీసుకుంది. అయితే ఇక్కడా కొన్ని సమస్యలు ఉండనే ఉన్నాయి... సంవత్సరానికి వేలల్లో వచ్చే షార్ట్ ఫిలింస్ లో మంచి సబ్జెక్ట్, గొప్ప ఆలోచహన రేకిత్తించే సినిమాలు లు సరైన గుర్తింపు కు నోచుకోకుండానే మరుగున పడి పోతున్నాయి. అలాంటి వారికోసం ఒక అవకాశం ఇలా వచ్చింది...

సోల్జర్ స్వచ్చంద సంస్థ

సోల్జర్ స్వచ్చంద సంస్థ

జగిత్యాలకు చెందిన 9 మంది యువకులు నిర్వహిస్తున్న సోల్జర్ స్వచ్చంద సంస్థ ఇప్పుడు సామాజిక స్పృహతో కూడిన షార్ట్ ఫిలిమ్ ల కోసం ఒక కాంపిటీషన్ నిర్వహిస్తోంది. మచ్చరవి (అధ్యక్షుడు), చిత్రకారుడు ఎలిగేటి రాజేంద్రప్రసాద్ (గౌరవ అధ్యక్షుడు), ఉపాధ్యాయుడు గా పని చేస్తూ సమాజానికి ఏంతో కొంత చేయాలని తపించే కళాకారుడు అనీల్ రావు (సెక్రటరీ) ఇలా మరికొంతమంది ఒక్కొక్కరూ ఒక్కొక్క రంగం నుంచి వచ్చినా ఒక్కటిగా కలిసి సోల్జర్స్ అనే స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేసారు.

20 నిమిషాలకు మించని

20 నిమిషాలకు మించని

ఇందులో భాగంగానే ఔత్సాహికులైన యువదర్శకులూ, కళాకారులనూప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ కాంపిటీషన్ లో పాల్గొనటానికి సామాజిక స్పృహ ఇతివృత్తంగా 20 నిమిషాలకు మించని మీ షార్ట్ ఫిలిమ్స్ ని పంపించవచ్చు.

మొదటి బహుమతి

మొదటి బహుమతి

మొదటి బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 5000, తృతీయ, కన్సోలేషన్ బహుమతులుగా 3000, 2000 అందిస్తారు. ఎంట్రీ వివరాల కోసం 7013068340 నంబర్లో కానీ అనే Soldiersswachandasevasamstha@gmail.com మెయిల్ లో గానీ సంప్రదించవచ్చు. 22-05-2017 లోపు గా మాత్రమే మీ ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. ఆతర్వాత వచ్చిన ఎంట్రీలు స్వీకరించరు. ఇంకా ఎందుకు ఆలస్యం మీ మీ ప్రతిభని వెలికితెచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి.

English summary
Soldiers Swacchanda sevasamstha Jagityal Conducting a Short film Contest. it is an opportunity to short film makers
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu