»   » 'సన్నాఫ్‌ సత్యమూర్తి' : పాపం మొక్కే కదా అని.. పీకేశారు..!

'సన్నాఫ్‌ సత్యమూర్తి' : పాపం మొక్కే కదా అని.. పీకేశారు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా ఫ్యాన్స్‌కు కోపమొచ్చింది.. తమ అభిమాన సినీ హీరో అల్లు అర్జున్‌ నటించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' సినిమా ఆడియో విడుదలకు తమను అనుమతించలేదన్న కోపాన్ని పూలకుండీలు, మొక్కలపై ప్రదర్శించారు. ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమానికి నాలుగువేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దాదాపు ఐదు వేల మంది అభిమానులు అక్కడికి విచ్చేశారు. పోలీసులు మిగలిన వారిని లోనికి అనుమతించకపోవడంతో చాలా సేపు నిరీక్షించారు. ఎంతసేపటికీ లోనికి పంపించకపోవడంతో కోపమొచ్చింది. తిరిగి వెళ్తున్న సమయంలో న్యాక్‌ ప్రధాన ద్వారం నుంచి హెచ్‌ఐసీసీకి వెళ్లే మార్గంలో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన మొక్కలను పీకేశారు. కుండీలను ధ్వంసం చేశారు.


అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమిది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. సమంత, నిత్య మేనన్‌, అదా శర్మ హీరోయిన్స్. రాధాకృష్ణ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు.


Son of Satyamurthy audio:mega Fans Angry

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ''జులాయి' కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' దానికి నాలుగు రెట్లు విజయం సాధిస్తుంది''అన్నారు.


సమంత చెబుతూ ''ఒక అందమైన కుటుంబ కథా చిత్రమిది. అల్లు అర్జున్‌తో తొలిసారి నటించాను. హార్డ్‌వర్క్‌ అనే పదానికి నిర్వచనం ఆయన'' అంది. ఉపేంద్ర మాట్లాడుతూ ''చాలా కాలం తరవాత మళ్లీ తెలుగులో నటించా. చాలా మంచి పాత్ర దక్కింది. బన్నీ సినిమాలన్నీ చూస్తూ ఉంటా. తనదైన స్త్టెల్‌తో దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకొన్నాడ''న్నారు.


''నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. అడగ్గానే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్న ఉపేంద్రగారికి ధన్యవాదాలు'' అన్నారు త్రివిక్రమ్‌.


అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. కంటెంట్‌ ఉన్నవాడికి కటౌట్‌తో పనిలేదు.. అని హరీష్‌ శంకర్‌ ఓ డైలాగ్‌ రాశాడు. త్రివిక్రమ్‌ గారిని చూస్తే అదే గుర్తొస్తుంది. మేటర్‌ ఉన్నవాడికి మ్యాజిక్‌తో పని లేదు. ఈ సినిమాలోనూ మంచి సంభాషణలున్నాయ''న్నారు.


సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Allu Arjun's latest Son of satyamurthy audio launched last night.
Please Wait while comments are loading...