»   »  శ్రీలంకలో రచ్చ రచ్చ చేస్తోంది,ఫొటోలు చూస్తే మతిపోతుంది

శ్రీలంకలో రచ్చ రచ్చ చేస్తోంది,ఫొటోలు చూస్తే మతిపోతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ఇప్పుడు శ్రీలంకలో చక్కర్లు కొడుతోంది. అక్కడ ఆమె అందమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా తనతో పాటు తన అభిమానులకు సైతం ఆ అందాలని పరిచయం చేయటానికా అన్నట్లు వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.

ఈ ఫొటోలలో ఆమెను చూసిన వారు ఒకే ఒక పదం అంటున్నారు. అదే ఆసమ్. అంతలా మెరిసిపోతోంది సోనాక్షి. సోనాక్షి పర్శనల్ ఫొటోలుగా వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో శ్రీలంక టూర్ నిమిత్రం పోస్ట్ చేసినవి మీకు క్రింద స్లైడ్ షోలో అందిస్తున్నాం.

అవునూ ..హఠాత్తుగా సోనాక్షికు శ్రీలంక లో ఏం పని అంటారా..ఆమె తన తాజా చిత్రం కోసం అక్కడకి వెళ్లిందట. షూటింగ్ అయిపోగానే ఆ దేశంలో తిరగటం మొదలెట్టింది. అక్కడ అందమైన ప్రధేశాలను తన కెమెరాలో కాప్చర్ చేస్తూ మురిసిపోతోంది.

ఈ ఫొటోలు చూస్తుంటే సోనాక్షి ఎంతలా ఎంజాయ్ చేస్తుందో అర్దమవుతుంది. ఎంతో కష్టపడి షూటింగ్ లో పాల్గొని ఆమె ఇలా రిలాక్స్ అవుతోందన్నమాట. ప్రకృతిలోనూ, నీళ్లలోనూ ఆమె ఎక్కువ సేపు గడుపుతోంది. తను రోజంతా కష్టపడింది మొత్తం ఒక్క దెబ్బలో మర్చిపోతున్నాను అని చెప్తోంది.

స్లైడ్ షోలో సోనాక్షి ఫొటోలు

ఫోర్స్ 2

ఫోర్స్ 2

ఫోర్స్ 2 చిత్రం కోసం సోనాక్షి ..శ్రీలంక వెళ్లిందని సమాచారం.

మారింది 

మారింది 


బొద్దుగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి.. ముద్దుగుమ్మగా మారిపోయిన నటి సోనాక్షి సిన్హా!

దబాంగ్

దబాంగ్

తొలి సినిమాతోనే విజయాన్ని అందుకొని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

అదొక్కటి కాదు..

అదొక్కటి కాదు..

ఓవైపు సినిమాల్లో.. మరోవైపు ఫ్యాషన్‌ కార్యాక్రమాల్లో మెరుస్తూ బిజీగా మారిపోయింది.

అయితే..

అయితే..

సినిమాల కంటే తనకి ఫ్యాషన్‌ డిజైనింగ్‌పైనే ఆసక్తి ఎక్కువని అంటోంది.

అక్కడ కూడా

అక్కడ కూడా

ఎప్పటికైనా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలోనే రాణిస్తానని చెబుతోంది.

ప్రస్తుతం

ప్రస్తుతం

'ఫోర్స్‌-2'.. 'అఖీరా' సినిమాల్లో నటిస్తోంది సోనాక్షి..

సోనాక్షి మాట్లాడుతూ..

సోనాక్షి మాట్లాడుతూ..

''నా విధి ఎన్నో రకాలుగా రాసిపెట్టి ఉంది. అందులో నటించాలని ఉంది కాబట్టి నటిస్తున్నాను. కానీ.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌పైనే నా ఆలోచనలు ఉండేవి.చదువుకునే సమయంలో లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ షోలకు వెళ్లేదాన్ని. అయితే అక్కడ కేవలం వాలంటీర్‌గా పని చేసేదాన్ని.

గుర్తింపు అక్కడ కూడా..

గుర్తింపు అక్కడ కూడా..

నటన అనేది నా వృత్తి. ఫ్యాషన్‌కూ నటనకు సంబంధం ఉంది. అందుకే భవిష్యత్తులో తప్పకుండా ఫ్యాషన్‌ రంగంలోకి వెళ్తా. నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటా అని చెప్పింది సోనాక్షి.

పనని ప్రేమిస్తున్నా

పనని ప్రేమిస్తున్నా

ప్రస్తుతం తను పనిని ప్రేమిస్తున్నాను అని చెప్తోంది. అంతకు మించి తనకు మనస్సులో ఎవరూ లేరంటోంది.

ఎంజాయ్

ఎంజాయ్

ప్రస్తుతం ప్రకృతిని ఆరాధించటం, ఎంజాయ్ చేయటమే తన కాలక్షేపం అంటోంది.

టూర్స్ అంటే ఇష్టం

టూర్స్ అంటే ఇష్టం

తనకు కొత్త ప్రదేశాలు తిరగటం అన్నా, కొత్త వారిని పరిచయం చేసుకోవటం అన్నా తెగ ఇష్టం అని చెప్తోంది.

English summary
Sonakshi Sinha, is currently chilling in Sri Lanka and is having a good time wandering around several places in the country. Sonakshi, who is a social media buff, has posted several pictures enjoying her time in Sri Lanka, and all the pictures are damn right awesome! Check out the pictures of Sonakshi Sinha chilling in Sri Lanka here!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu